వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెకింగ్ అయిపోయింది: రాహుల్ గాంధీ పంజాబ్‌కు రైలెక్కారు (ఫోటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఢిల్లీలో రైలెక్కారు. ఆయన రైలులో పంజాబ్‌కు బయలుదేరారు. పంజాబ్ ధాన్యాగారాలుగా పేరు మోసిన ఖన్నా, గోవింద్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ధాన్యం మార్కెట్ రాష్ట్రంలో ఎలా ఉందనే విషయాన్ని ఆయన తెలుసుకుంటారు.

రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తనకు చెప్పారని, పరిస్థితిని స్వయంగా తానే చూడదలుచుకున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. టీ షర్ట్ ధరించి ఆయన రైలు ఎక్కుతూ మీడియాతో మాట్లాడారు. రైలు బోగీలో కిటికీ పక్కన కూర్చున్న రాహుల్ నరేంద్ర మోడీ భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానని చెప్పారు.

రైతుల నుంచి భూమిని లాక్కుంటున్నారని, ఇది అత్యంత ప్రధానమైన సమస్య అని, అది తప్పు అని, దాన్ని ఎదుర్కుంటానని రాహుల్ చెప్పారు. ఆయన వెంట పలువురు కాంగ్రెసు నాయకులు నడిచారు.

అగ్రహోదగ్రులైన రైతులు పంజాబ్‌లవోని అమృతసర్, జలంధర్ మధ్య రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వారం తర్వాత దేశంలో రాహుల్ గాందీ పాదయాత్ర చేపట్టనున్నారు. మోడీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన ఈ పాదయాత్ర చేస్తారు.

English summary
Congress vice president Rahul Gandhi boarded a train to Punjab at the New Delhi Railway station today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X