వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజుకో సంచలనం: ఆగస్టా డీల్‌లో ఎరగా అందాల భామ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇరకాలంటో పడేసిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. వీవీఐపీ చాఫర్ కుంభకోణంగా పరిగణిస్తున్న దీనిలో రూ.3,200 కోట్ల విలువ కలిగిన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు గాను ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ అనే కంపెనీ డబ్బుతో పాటు అందాల భామను కూడా ఎరగా వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డానిష్‌లో పుట్టి లండన్‌లో నివసిస్తోన్న 31 ఏళ్ల అందాల సుందరి క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌ను ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మైఖేల్ పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట తన కంపెనీలో ఆమెకు డైరెక్టర్ పదవిని ఇచ్చిన మైఖేల్ ఆ తర్వాత అగస్టా కుంభకోణంలో ఆమెను ఎరగా వేశాడు.

డబ్బులో పాటు ఎంతో సౌందర్యవతి, అందగత్తె క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌‌ను ఎరగా వేయడంతో భారత్‌కు చెందిన అధికారులతో పాటు రాజకీయ నేతలు డబ్బుతో పాటు ఆమె అందానికి దాసోహమైపోయి కాంట్రాక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

AgustaWestland: What is 31-yr-old Christine Bredo Spliid's connection with the chopper scam?

కాగా, ప్రస్తుతం 31 ఏళ్ల వయస్సున్న క్రిస్టిన్ బ్రెడో స్ల్పిడ్‌ 2009లో మైఖేల్ కంపెనీలో డైరెక్టర్‌గా చేరింది. అప్పుడు యవ్వన దశలో ఉన్న స్ల్పిడ్‌ను రంగంలోకి దించి అందాల విందు చేయించిన మైఖేల్ తన పనిని మరింత సులభంగా చక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

వీవీఐపీ హెలికాప్టర్ల కోసం ఇండియా జారీ వెలువరించిన కాంట్రాక్టుని దక్కించుకునేందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ మైఖేల్‌ను రంగంలోకి దింపి తొక్కించాల్సిన అడ్డదారులన్నీ తొక్కింది. సూట్ కేసుల నిండా డబ్బులు, 20ఏళ్ల వయసులో ఉన్న స్ల్పిడ్‌తో కలిసి రంగంలోకి దిగిన మైఖేల్ ఢిల్లీ, దుబాయిల కేంద్రంగా భారీ విందు, పొందు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో ఇటలీ కోర్టు సంచలన తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో విచారణకు హాజరైన గౌతం ఖైతాన్ స్ల్పిడ్ ప్రమేయానికి సంబంధించి విషయాలను వెల్లడించాడు.

క్రిస్టియన్ మైఖేల్‌కు చెందిన కంపెనీల్లో ఒకటైన బీటెల్ నుట్ హోం లిమిటెడ్‌కు స్ల్పిడ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెని ద్వారానే మనీ లాండరింగ్ లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. కాగా, 2010, 2013లలో భారత్‌తో పాటు దుబాయికి పలుమార్లు వచ్చిన స్ల్పిడ్... భారత అధికారులతో పాటు రాజకీయ నేతలను కలిసినట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పక్కా ఆధారాలు సంపాదించాయి.

ఈ నేపథ్యంలో స్ల్పిడ్‌ను తమ విచారణకు అనుమతించాలని కూడా సీబీఐ ఇప్పటికే బ్రిటన్‌కు లేఖలు రాసినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో స్ల్పిడ్ ప్రమేయం, ఆమె విచారణ కోరుతూ లేఖ రాసిన విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీబీఐ అధికారి ధ్రువీకరించారు.

English summary
Christine Bredo Spliid, a 31-year-old Danish national living in London, has given a fresh twist to the VVIP chopper scam probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X