వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళని, పన్నీర్‌ గ్రూపుల విలీనం: చెన్పైకి విద్యాసాగర్‌రావు, దినకరన్ న్యాయపోరాటం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని అన్నాడిఎంకెలో కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.అన్నాడిఎంకె అమ్మ, పురచ్చితలైవి శిబిరాలు విలీనం కానున్నాయి.రెండు శిబిరాల మద్య రాజీ కుదిరింది. సోమవారం నాడు రెండు శిబిరాలు విలీనం కానున్న నేపథ్యంలో సోమవారం నాడు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన చెన్నైకు బయలుదేరారు.

కొంత కాలంగా అన్నాడిఎంకె అమ్మ, పురచ్చితలైవి వర్గాల మధ్య విలీనం కోసం చర్చలు సాగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. రెండు వర్గాలు విలీనమయ్యేందుకు అంగీకరించాయి.

సోమవారం నాడు రెండు పార్టీలు విలీనమయ్యే అవకాశాలున్నాయి. అయితే మంత్రివర్గంలో కూడ మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అన్నాడిఎంకెలో శశికళ, దినకరన్‌కు చెక్ పెట్టేందుకుయ పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీంతో ఈ రెండు గ్రూపులు విలీనం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

హుటాహుటిన చెన్నైకు బయలుదేరి గవర్నర్ విద్యాసాగర్‌రావు

హుటాహుటిన చెన్నైకు బయలుదేరి గవర్నర్ విద్యాసాగర్‌రావు

తన అపాయింట్‌మెంట్లన్నీ రద్దుచేసుకొని మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకు వెళ్ళారు. ఈ మేరకు మహరాష్ట్ర రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. చెన్నైకు అత్యవసరంగా వెళ్ళాల్సి రావడంతో విద్యాసాగర్‌రావు ముందుగా ఫిక్స్ చేసుకొన్న అపాయింట్‌మెంట్లను రద్దుచేసుకొన్నారు.

Recommended Video

TN govt file sealed response to HC query on Jayalalithaa’s death -కోర్టులో పిల్- Oneindia Telugu
శశికళను సాగనంపేందుకు చర్యలు

శశికళను సాగనంపేందుకు చర్యలు

రెండు గ్రూపుల మధ్య విలీనం దిశగా చర్యల కోసం పళని గ్రూప్ అన్ని చర్యలను తీసుకొంటుంది.అన్నాడిఎంకె నేతల అత్యవసర భేటీకి పళనిస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.శశికళను పార్టీనుండి పంపేందుకే ఈ రెండు గ్రూపులు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.

న్యాయపోరాటానికి దినకరన్ వర్గం

న్యాయపోరాటానికి దినకరన్ వర్గం

పళనిస్వామి, పన్నీర్‌సెల్వం గ్రూపులు విలీనం కావాలనే నిర్ణయం తీసుకోవడంతో శశికళ వర్గం ఆత్మరక్షణలో పడింది. ఈ విషయమై పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి.ఈ విలీనంపై న్యాయపోరాటానికి దినకరన్ వర్గం సమాయత్తమౌతోంది.దినకరన్ వర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారనే విషయం కూడ ఆసక్తి కల్గిస్తోంది.

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు

పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడిఎంకె అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. పన్నీరు‌సెల్వం పెట్టిన షరతుల కారణంగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ తొలగింపు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పళని, పన్నీరు వర్గాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి.పన్నీర్‌సెల్వం శిబిరంలో ఉన్న మధుసూదన్ అన్నాడిఎంకె నిబంధనల మేరకు పార్టీ ప్రిసీడియం ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నందున ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

English summary
The Governor of Maharashtra and Tamil Nadu Ch Vidyasagar Rao has cancelled all his engagements for the day in Mumbai and is shortly leaving for Chennai this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X