వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ సస్పెండ్ చేసిన శశికళ పుష్పకు కీలక పదవి?: అపోలో నుంచి జయ తరలింపు!

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన సోమవారం నాడు రాత్రి పదకొండు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన సోమవారం నాడు రాత్రి పదకొండు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ బులెటిన్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు.

జయ ఆరోగ్యంపై గందరగోళం: చనిపోయిందని వదంతులు, అపోలో తాజా షాకింగ్ ప్రకటనజయ ఆరోగ్యంపై గందరగోళం: చనిపోయిందని వదంతులు, అపోలో తాజా షాకింగ్ ప్రకటన

మరోవైపు, శాసన సభ్యులు మరోసారి భేటీ కానున్నారు. తొలిసారి జరిగిన భేటీలో పన్నీరు సెల్వంకు (ముఖ్యమంత్రిగా) పూర్తి మద్దతు లభించలేదు. దీంతో మరోసారి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడనున్నారని తెలుస్తోంది.

jayalalithaa

పలు పదవుల రేసులో జయలలిత నమ్మిన బంటు పన్నీరు సెల్వం, జయ సన్నిహితురాలు శశికళలు ఉన్నారు. అలాగే పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితం సస్పెండైన ఎంపీ శశికళ పుష్పకు కూడా ఓ కీలక పదవి లభించవచ్చునని తెలుస్తోంది. నెచ్చెలి శశికళకు మాత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లభించవచ్చునని అంటున్నారు.

శాంతిభద్రతలు అదుపులో: రాజ్‌నాథ్ సింగ్‌

జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. జయ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు కేంద్రం పరిస్థితుల్ని సమీక్షిస్తోంది.

విషమంగా జయలలిత ఆరోగ్యం: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ రద్దువిషమంగా జయలలిత ఆరోగ్యం: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ రద్దు

జయలలిత మృతి చెందారని తమిళ టీవీ ఛానల్స్ ప్రచారం చేశాయి. దీంతో దానిని అందరూ రాశారు. దీంతో అభిమానులు అపోలో ఆసుపత్రి పైన రాళ్లతో దాడి చేశారు. అయితే జయలలిత వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో వైద్యులు ఆ తర్వాత ప్రకటించారు.

అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో తమిళనాడు పోలీసులు సహా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నారు. అపోలో ఆసుపత్రి వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిపి మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితులైనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. తమిళనాడులో శాంతిభద్రతలకు చర్యలు చేపట్టామన్నారు.

జయ ఆరోగ్యంపై అపోలో సంగీత రెడ్డి ట్వీట్, వారసుడిపై చర్చ, పన్నీరు సెల్వమేనా?జయ ఆరోగ్యంపై అపోలో సంగీత రెడ్డి ట్వీట్, వారసుడిపై చర్చ, పన్నీరు సెల్వమేనా?

జయలలితను అపోలో నుంచి తరలిస్తున్నారా?

అపోలో నుంచి జయలలితను తరలించనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అపోలో ఆసుపత్రి ఎదుట మూడు వాహనాలను నిలిపారు. జయలలితను తరలించేందుకే వాటిని ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. సోమవారం సాయంత్రం ఆమె మృతి చెందినట్లుగా కొన్ని తమిళ చానల్స్ ప్రచారం చేశాయి. దీంతో అభిమానులు అపోలో ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే జయను తరలిస్తుండవచ్చునని అంటున్నారు.

English summary
AIADMK MLAs could be held later tonight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X