వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్యాదగా మంత్రి పదవులు ఇవ్వండి, లేదంటే జంప్, తమిళనాడు సీఎంకు వార్నింగ్ !

తమిళనాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. మాకు మంత్రి పదవులు ఇవ్వకుంటే మీకు మద్దతు ఉపసంహరించుకుంటామని, మీ వ్యతిరేక వర్గంలోకి వెళ్లిపోతామని ఎమ్మెల్యేలు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. మాకు మంత్రి పదవులు ఇవ్వకుంటే మీకు మద్దతు ఉపసంహరించుకుంటామని, మీ వ్యతిరేక వర్గంలోకి వెళ్లిపోతామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారని అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ వర్గాలు అంటున్నాయి.

దినకరన్ డెడ్ లైన్: శశికళ జోస్యం, పెత్తనం చెయ్యడానికి డేట్ ఫిక్స్, అంత సీన్ లేదు!దినకరన్ డెడ్ లైన్: శశికళ జోస్యం, పెత్తనం చెయ్యడానికి డేట్ ఫిక్స్, అంత సీన్ లేదు!

తమిళనాడు మాజీ మంత్రులు, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితరులు ఇటీవల ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని కలిశారు. తరువాత తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సీఎం ముందు పెట్టారు.

అమ్మ మంత్రి వర్గంలో

అమ్మ మంత్రి వర్గంలో

ప్రస్తుతం మాకు ఇంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వెంటనే మాకు మంత్రి పదవులు ఇవ్వాలని, గతంలో జయలలిత మంత్రి వర్గంలో తాము పని చేసిన విషయం మీకు తెలుసు కదా అని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి అసమ్మతి నాయకులు చెప్పారని సమాచారం.

ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ?

ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ?

మాకు మంత్రి పదవులు ఇస్తామని ఇంతకాలం మాయమాటలు చెబుతూ వస్తున్నారని, ఇక లాభం లేకపోవడంతో మేము వేరే దారి చూసుకుంటామని, మీ వ్యతిరేక వర్గంలోకి వెళ్లి పోతామని, ప్రభుత్వానికి వ్యతిరేంగా ఆందోళన చేసి మీ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని హెచ్చరించారని తెలిసింది.

తోపు బ్యాచ్ లో 17 మంది ఎమ్మెల్యేలు

తోపు బ్యాచ్ లో 17 మంది ఎమ్మెల్యేలు

తోపు వెంకటాచలం గతంలో 17 మంది ఎమ్మెలతో ఓ వర్గం ఏర్పాటు చేసుకుని ఇలాగే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని బెదిరించారు. ఇప్పుడు మరో సారి మంత్రి పదవుల కోసం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి డెడ్ లైన్ పెట్టారు.

సీఎంకు ఎంత మంది మద్దతు ?

సీఎంకు ఎంత మంది మద్దతు ?

ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లిపోతాం అంటూ బెదిరిస్తున్న తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితరులు ఏ వర్గంలోకి వెలుతారో అర్థం కావడంలేదని అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం, టీటీవీ దినకరన్ వర్గంలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కొవత్తూరు రిసార్ట్ లో హామీ ?

కొవత్తూరు రిసార్ట్ లో హామీ ?

కొవత్తూరు రిసార్ట్ లో అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలు జరిగిన సమయంలో తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితరులకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. అయితే ఇంత వరకూ కాలం గడుపుతూ వస్తుండటంతో ఇప్పుడు ఎడప్పాడి పళనిసామికి డెడ్ లైన్ విధించారని తెలిసింది.

English summary
AIADMK sources said that Kongu belt MLAs very disappointed over the Ministerial birth and decided to protest against the govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X