వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి.టి.వి. దినకరన్‌ ను అరెస్టు చేసిన పోలీసులు

ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అనుకున్నట్లుగానే టి.టి.వి. దినకరన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో ఆ పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. తొలుత సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ఎవరో తెలియదని చెప్పిన దినకరన్‌ తర్వాత అతను తెలుసు అని అంగీకరించాడు.

ttv-dinakaran

ఈ కేసులో దినకరన్‌ సహాయకుడు మలిఖార్జునను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నాటకీయ పరిణామాల నడుమ టి.టి.వి. దినకరన్ ను కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు.

English summary
NEW DELHI: TTV Dinakaran, the deputy chief of Tamil Nadu's ruling party the AIADMK, was arrested by the Delhi Police close to midnight on Tuesday. Mr Dinakaran, who was questioned by the Crime Branch of the Delhi Police in the national capital for four consecutive days, is accused of attempting to bribe Election Commission officials to allot his faction of the AIADMK, the party's Two-Leaf symbol, frozen by the poll panel after a dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X