వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియాలో ఏసీ కట్: ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు, ఊపేశారు(వీడియో)

ప్రభుత్వ రంగ సంస్థలపై జనానికి ఉన్న అభిప్రాయాన్ని మరోసారి బలపర్చించి ఎయిరిండియా సంస్థ. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ఏసీలు పనిచేయలేదు. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలపై జనానికి ఉన్న అభిప్రాయాన్ని మరోసారి బలపర్చించి ఎయిరిండియా సంస్థ. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ఏసీలు పనిచేయలేదు. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. ఊపిరాడనట్లవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్‌ 320 విమానం ఆదివారం మధ్యాహ్నం1.55గంటలకు పశ్చిమ్‌బంగాలోని బగ్దోగ్రా నుంచి ఢిల్లీ బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాలకే అందులోని ఏసీలు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు సిబ్బందికి సమాచారమిచ్చారు. ఏసీల్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. త్వరలోనే పరిష్కరిస్తామని సిబ్బంది తెలిపారు.

అయితే ఏసీలు ఎంతకీ పనిచేయకపోవడంతో.. విమానంలో ఉక్కపోత మొదలైంది. ఆ సమయంలో విమానంలో 168మంది ప్రయాణికులున్నారు. ఏసీలు లేకపోవడంతో కొందరు ఆక్సిజన్‌ మాస్క్‌లు ధరించారు. అయితే, అవి కూడా సక్రమంగా పనిచేయకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో ప్రయాణికులు పేపర్లు, రుమాళ్లతో విసురుకున్నారు. సిబ్బంది తీరు, విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, విమానం షెడ్యూల్‌ సమయం కంటే 20 నిమిషాలు ముందుగానే ఢిల్లీ చేరుకుంది. ఘటనపై స్పందించిన ఎయిరిండియా.. సాంకేతిక సమస్య వల్లే అలా జరిగి ఉంటుందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది.

English summary
The air-conditioning system of a Delhi-bound Air India flight malfunctioned on Sunday, leaving many passengers breathless, PTI reported. Flight AI 880, which was carrying 168 passengers from Bagdora to New Delhi, took off at 1.50 pm on Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X