వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందమైన ఎయిర్ హోస్టెస్‌ల నిర్లక్ష్యం, 17మందిపై వేటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్లక్షంగా విధులు నిర్వహించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసి సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ 17 మంది ఎయిర్ హోస్టెస్ లను సస్పెండ్ చేస్తున్నామని గురువారం ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లిన విమానాలు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నాయని గుర్తించిన ఎయిర్ ఇండియా అధికారులు తలలు పట్టుకున్నారు. విషయం ఏమిటంటూ ఆరా తీశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన విమానాలలోని ఎయిర్ హోస్టెస్ అందుకు కారణం అని గుర్తించారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లిన సమయంలో ఎయిర్ హోస్టెస్ లు విచిత్రంగా ప్రవర్థిస్తున్నారని తెలుసుకున్నారు. కొందరు గంటల పాటు విశ్రాంతి కావాలంటారని, కొందరు పైలెట్ లు ఎన్నిసార్లు పిలిచినా క్యాబిన్ లోకి రారని, ప్రయాణికులకు సరైన సర్వీసు అందివ్వడం లేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయని తెలుసుకున్నారు.

Air India has suspended 17 air hostesses

అంతే ఎయిర్ హోస్టెస్ లకు ఇప్పటికే నాలుగైదుసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయితే వారి ప్రవర్థనలో మార్పు రాలేదు. గల్ఫ్ దేశాలకు వెలుతున్న సుమారు 30 శాతం విమానాలు ఆలస్యంగా తిరిగి వస్తున్నాయని గుర్తించారు.

నిర్లక్షంగా విధులు నిర్వహించి సంస్థకు నష్టం కలిగిస్తున్నారని 17 మంది ఎయిర్ హోస్టెస్ లను విధుల నుండి తప్పించారు. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా సంస్థ విధుల నుండి తప్పించిన ఎయిర్ హోస్టెస్ ల సంఖ్య 272కు చేరిందని ఒక అధికారి తెలిపారు. విచారణ పెండింగ్ లో పెట్టారు.

న్యూయార్క్, బోస్టన్లకు భారత్ నుండి డైరెక్ట్ సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ఎయిర్ ఇండియా. ఉత్తర అమెరికాలో సేవలు అందిస్తున్నది. త్వరలో అమెరికా, యూరప్ దేశాలలో ఎయిర్ ఇండియా తమ సేవలను విస్తరించాలని బావించింది. కొందరి వలన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, చెడ్డ పేరు వస్తే చాలకష్టం అవుతుందని అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Air India has suspended 17 of its cabin crew members including some senior air hostesses, pending enquiry,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X