వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఫీచర్ ఫోన్‌ ఎఫెక్ట్‌: టెలికాం, మీడియా షేర్లు పతనం

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ఎఫెక్ట్ సాటి టెలికాం కంపెనీలతోపాటు మీడియా సంస్థలపైనా పడింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మీడియా షేర్లు, టెలికాం షేర్లు కుదేలయ్యాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఫోన్‌ ప్రకటనతో మీడియా షేర్లు, టెలికాం షేర్లు భారీగా పతనమయ్యాయి. ఐడియా సెల్యులార్‌ ఏకంగా 6 శాతం, భారతి ఎయిర్‌ టెల్‌, 3.2, ఆర్‌కాం 1.43 శాతం, డిష్‌ టీవీ, 6 శాతం, హాత్ వే కేబుల్‌ 2 శాతం పతనాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఆర్‌ఐఎల్‌ 3 శాతం లాభాలతో కొనసాగుతోంది.

జియో ఫీచర్ ఫోన్ ఉచితం, కానీ: ముఖేష్ సంచలనం, తల్లి కంటతడిజియో ఫీచర్ ఫోన్ ఉచితం, కానీ: ముఖేష్ సంచలనం, తల్లి కంటతడి

గతంలో రిలయన్స్‌ జియో ఎంట్రీతోనే దేశీయ టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఉచిత ఆఫర్ల నుంచి టారిఫ్‌లను మార్చుకుంటూ వచ్చినా దేశీయ పత్యర్థి టెలికాం కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

Airtel, Idea shares down after Reliance Jio's offer announcement

ఇప్పటికీ మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్ల ఆందోళన, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తాజాగా శుక్రవారం ప్రపంచంలోనే అతి చవకైన 4జీ ఫీచర్‌ ఫోన్‌ జియో ప్రకటించడం ఈ కంపెనీలను మరింత కుదేలు చేసింది.

కొత్త జియో ఫోన్లో ఫీచర్స్ ఇవే..: బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే..?కొత్త జియో ఫోన్లో ఫీచర్స్ ఇవే..: బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే..?

ముఖ్యంగా జియో కస్టమర్లకు ఈ ఫోన్‌ పూర్తిగా ఉచితం. వాయిస్‌ కాల్స్‌ ఉచితం. దీంతో పాటు కేవలం రూ.153 లకే అన్ని సేవలను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.

దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మీడియా షేర్లు, టెలికాం షేర్లు కుదేలయ్యాయి. అటు విశ్లేషకులు కూడా ఫోన్‌ మార్కెట్లోకి జియో ప్రవేశించడం మిగతా టెలికం దిగ్గజాలను భారీ స్థాయిలో ప్రభావితం చేయనుందని వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Telecom stocks came under selling pressure on Tuesday, led by Airtel which lost 4 per cent, after Reliance Jio Chairman Mukesh Ambani announced a slew of offers, including 20 per cent more data than any rival from April. Shares of Bharti Airtel declined by 4.02 per cent to end at Rs 360.55 on BSE. During the day, it lost 4.27 per cent to Rs 359.60. Idea Cellular went down by 0.37 per cent to close at Rs 108.30 after falling 1.88 per cent to Rs 106.65 in intra-day. Shares of Reliance Industries Ltd on the other hand rose by 1.36 per cent to close at Rs 1,088.25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X