వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్:రూ.100 కే 10 జీబీ అదనపు డేటా, జియోకు ఎయిర్ టెల్ చెక్ ఇలా...

రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఎయిర్ టెల్, ఐడియం కంపెనీలు టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ మేరకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఇతర టెలికం కంపెనీలు తమ వినియోగదారులను ఆకట్టుకొనేందుకుగాను భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి,.జియో నుండి పోటీని తట్టుకొని నిలబడేందుకుగాను ఆ కంపెనీలుఈ మేరకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్ తాజాగా తన కస్టమర్లకు రూ.100 లకే 10 జీబి వరకు అదనపు 3జీ,4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి వ్రవేశించడంతోనే ఇతర కంపెనీలను లక్ష్యంగా చేసుకొంది. ఇండియాలో ఎయిర్ టెల్ , ఆ తర్వాతి స్థానాల్లో ఐడియా , వోడాఫోన్ లు ఉన్నాయి.

రిలయన్స్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఇతర టెలికం కంపెనీలు తమ మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దరిమిలా తన ప్రత్యర్థులను మరింత దెబ్బతీసేందుకుగాను రిలయన్స్ కంపెనీ ఉచిత ఆఫర్లను ఈ ఏడాది మార్చివరకు ప్రకటించింది.

అయితే రిలయన్స్ ఇస్తోన్న ఆఫర్ల పట్ల ఎయిర్ టెల్, ఐడియా టెలికం కంపెనీలు ట్రాయ్ ను ఆశ్రయించాయి.ట్రాయ్ కూడ రిలయన్స్ తీసుకొన్న విధానాలను సమర్థించింది.దీంతో ఈ రెండు కంపెనీలు అప్పిలేట్ అధారిటీని ఆశ్రయించాయి.

రూ.100 కే 10జీబీ అదనంగా ఇస్తోన్న ఎయిర్ టెల్

రూ.100 కే 10జీబీ అదనంగా ఇస్తోన్న ఎయిర్ టెల్

రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ రేట్లను మార్చుకొంటున్నాయి. కస్టమర్లకు బంఫర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఉచిత ఆఫర్లతో రియలన్స్ జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కస్టమర్లను దాటిపోయింది. అతి తక్కువ కాలంలోనే జియో ఈ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఇతర కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తాజాగా తన కస్టమర్లకు బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.కేవలం రూ.100 చెల్లించి అదనంగా 10జీబీ 3జీ లేదా 4జీ డేటాను పొందవచ్చని ప్రకటించింది. రిలయన్స్ వైపుకు తమ కస్టమర్లు వెళ్ళిపోకుండా ఉండేందుకుగాను ఎయిర్ టెల్ ఈ మార్గాన్ని ఎంచుకొంది.

రిలయన్స్ కంటే చౌకగా ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్స్

రిలయన్స్ కంటే చౌకగా ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్స్

రిలయన్స్ కంటే ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్స్ ను అందించాలని భావిస్తోంది. రిలయన్స్ జియో మంగళవారం నాడు తన టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి తర్వాత నుండి రిలయన్స్ వినియోగదారులు మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.అయితే ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎయిర్ టెల్ తక్కువ టారిఫ్ ను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ మేరకు టారిఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఎయిర్ టెల్ అదనపు డేటా ఇలా

ఎయిర్ టెల్ అదనపు డేటా ఇలా

ప్రస్తుతం ఎయిర్ టెల్ కస్టమర్లు ఉపయోగిస్తున్న డేటాకు అదనంగా డేటాను ఉపయోగించుకొనేందుకుగాను కేవలం వంద రూపాయాలను చెల్లిస్తే సరిపోతోందని ఎయిర్ టెల్ ప్రకటించింది.ప్రస్తుతం రూ.500 ప్లాన్ తో 3 జీ డేటాను పొందుతోంటే మరో రూ.100 అదనంగా చెల్లించి 10జీబీ డేటాను అదనంగా పొందే అవకాశం ఉంది.

28 రోజుల వరకే డేటా వినియోగించుకోవాలి

28 రోజుల వరకే డేటా వినియోగించుకోవాలి

ఈ ఆఫర్ ను కొన్ని వారాల పాటు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం.అయితే 4జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ 10 జీబీ డేటా 28 రోజుల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది. అయితే సర్ ప్రైజ్ ఆఫర్ కింద కంపెనీ దీన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ చాలా తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో డేటాను ఆఫర్ చేయడం ఇదే తొలిసారి.గత ఏడాది రూ.259 లకు 10 జీబీ డేటాను ఎయిర్ టెల్ అందించింది.

English summary
Begin the telecom wars have. A day after Jio announced the Prime service and said that it would offer 30GB 4G data for Rs 303, Airtel has sent a notification to its post-paid users that they can get additional 10GB data for Rs 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X