వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం :కొడుకును ఆశీర్వదించిన తండ్రి, ములాయం వర్గానికి దెబ్బ

ఎన్నికల కమీషన్ తనకు అనుకూలంగా నిర్ణయం వెలువర్చిన తర్వాత ములాయం ఇంటికివెళ్ళి అఖిలేష్ యాదవ్ ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. ఎన్నికల గుర్తు కోసం తండ్రి కొడుకులు ఇద్దరూ కూడ పోటీ పడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :తండ్రిపై తనయుడే ఆధిపత్యం సాధించాడు.సమాజ్ వాదీ పార్టీని, ఆ పార్టీ ఎన్నికల గుర్తును అఖిలేష్ కు కట్టబెడుతూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం ను కలుసుకొన్నారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకొన్నారు. పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రితనయుల మధ్య తీవ్రస్థాయిలో పోరాటం సాగుతోంది. ఈ తరుణంలో తండ్రి ఆశీర్వాదం తీసుకొని అఖిలేష్ యాదవ్ తన గౌరవాన్ని చాటుకొన్నారు.

తండ్రి కొడుకుల మద్య సవాల్ : అఖిలేష్ పై పోటీకి సిద్దం, బిజెపితో అఖిలేష్ చెట్టాపట్టాల్

ఎన్నికల గుర్తు కోసం ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించారు. పార్టీలో ములాయం సింగ్ యాదవ్ పట్టును కోల్పోయారు. మెజార్టీ నాయకులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా అఖిలేష్ వెంటే నిలిచారు.

షాక్ : లండన్ కు అమర్ సింగ్, అఖిలేష్ దే పై చేయి

ఈ పరిస్థితుల్లో అఖిలేష్ నుండి పార్టీని తనవైపుకు తిప్పుకొనేందుకుగాను ములాయంసింగ్ యాదవ్ ఎన్నికల గుర్తు కోసం కమీషన్ ను ఆశ్రయించాడు. అయితే ఎన్నికల కమీషన్ రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత అఖిలేష్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఆశ్చర్యం: బుందేల్ ఖండ్ నుండే అఖిలేష్ ఎందుకు పోటీచేయాలనుకొంటున్నాడు?

ఎన్నికల కమీషన్ నిర్ణయం అఖిలేష్ వర్గానికి ఊరటనిచ్చింది. ఈ పరిణమం ములాయం సిగ్ వర్గానికి ఊహించని దెబ్బ కల్గించింది. ఈ పరిస్థితులు ములాయం వర్గంపై తీవ్రంగా ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తండ్రి ఆశీర్వాదం తీసుకొన్న తనయుడు

తండ్రి ఆశీర్వాదం తీసుకొన్న తనయుడు

ఎన్నికల కమీషన్ తనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన వెంటనే అఖిలేష్ యాదవ్ తన సతీమణి డింపుల్ తో కలిసి తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వాదం తీసుకొన్నారు. తండ్రిపై తనకు గౌరవం ఉందని చాటుకొన్నాడు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవడం సరైందని భావించినందునే అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ ఈ విషయంలో పోటాపోటీగా వ్యవహరించారు.

సమాజ్ వాదీ పార్టీ కార్యాలయంలో సంబురాలు

సమాజ్ వాదీ పార్టీ కార్యాలయంలో సంబురాలు

లక్నోలోని పార్టీ కార్యాలయంంలో అఖిలేష్ మద్దతుదారులు సంబురాలు చేసుకొన్నారు. ఎన్నికల కమీషన్ తీసుకొన్న నిర్ణయం ములాయం వర్గానికి షాక్ కల్గించింది.అయితే ఈ పరిణామాలు అఖిలేస్ వర్గంలో ఉత్సాహన్ని నింపాయి. పార్టీ కార్యాలయంలో అఖిలేష్ వర్గీయులు సంబురాలు చేసుకొన్నారు. ములాయం వర్గీయులు అఖిలేష్ వర్గం కార్యకర్తలు సంబురాలు చేసుకోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు, పార్టీ ఎన్నికల గుర్తు కూడ అఖిలేష్ కే కేటాయిస్తూ ఎన్నికల కమీషన్ తీసుకొన్న నిర్ణయం ములాయంకు పెద్ద దెబ్బగా మారింది.

నాడు డిఎంకె, నేడు అఖిలేష్ కు అనుకూలంగా తీర్పు

నాడు డిఎంకె, నేడు అఖిలేష్ కు అనుకూలంగా తీర్పు

గతంలో డిఎంకె కూడ ఇధే తరహ సమస్యను ఎదుర్కొంది. ఎన్నికల గుర్తు విషయమై ప్రస్తుత పిఎంకె అధ్యక్షుడు ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించాడు. డిఎంకె పార్టీ పగ్గాలను స్టాలిన్ ను కట్టబెట్టేందుకు కరుణానిధి వ్యవహరించడాన్ని వైగో కు నచ్చలేదు.దీంతో ఆయన పార్టీపై తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి.అయితే కొన్ని కారణాలను చూపుతూ వైగో ను పార్టీని నుండి బహిష్కరించాడు కరుణానిధి,. ఆనాడు వైగో తో పాటు సుమారు 9 జిల్లాల కమిటీలు కూడ వెళ్ళాయి. ఈ సమయంలో వైగో అసలైన డిఎంకె తమదేనని, తమకే ఎన్నికల గుర్తును కేటాయించాలని ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించాడు. కరుణానిధి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల శాఖల తీర్మానాలను ఎన్నికల కమీషన్ ను పంపాడు.దీంతో వైగో చేసిన వినతిని ఎన్నికల కమీషన్ ను తోసిపుచ్చింది. ఈనాడు కూడ అఖిలేష్ వైపే మెజారిటీ నాయకులు , ప్రజా ప్రతినిధులు ఉండడంతో ఈసీ అఖిలేష్ వైపే మొగ్గుచూపింది.

అఖిలేష్ పై ములాయం వైఖరి ఎలా ఉంటుంది?

అఖిలేష్ పై ములాయం వైఖరి ఎలా ఉంటుంది?

అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ములాయం సింగ్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాడు తన నివాసం వద్ద కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఈ సమావేశం జరిగే నాటికి ఎన్నికల కమీషన్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.బిజెపితో అఖిలేష్ యాదవ్ చేతులు కలుపుతున్నారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా అఖిలేష్ యాదవ్ వైపుకు ముస్లింలు మొగ్గుచూపకుండా ఉండేందుకు ములాయం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల కమీషన్ నిర్ణయం ములాయం సింగ్ కు ఇబ్బంది కల్గించింది. తండ్రిపై తనయుడు పై చేయి కొనసాగుతోందా లేదా అనేది చూడాలి.

English summary
akhilesh met mulayam singh for blessings after ec verdict, ec allot cycle symbol to akhilesh, akhilesh met mulayam for blessings after ec verdict
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X