వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్: తమ్ముడికి వత్తాసు.... సీఎం కొడుక్కి క్లాస్

|
Google Oneindia TeluguNews

లక్నో: తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఇప్పుడు 70 ఎంఎం సినిమాను హెచ్ డీ టెక్నాలజీలో చూస్తున్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో రేగిన ముసలం ఇప్పట్లో సద్దుమణిగేటట్టు కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సమాజ్ వాదీ పార్టీ నేతలు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ములాయం సింగ్ యాదవ్, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య సయోధ్య కుదరలేదు. సోమవారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశం గందరగోళం మధ్య అసంపూర్తిగా ముగిసింది.

సొంత కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కాదని తమ్ముడు శివపాల్ యాదవ్, మిత్రుడు అమర్ సింగ్ కే ములాయం సింగ్ యాదవ్ తన మద్దతు ప్రకటించారు. తన సోదర సమానుడైన తన ప్రియ మిత్రుడు అమర్ సింగ్ ను వదులుకోబోనని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు.

ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నోసార్లు తనకు అమర్ సింగ్ అండగా నిలిచారని ములాయం సింగ్ యాదవ్ గుర్తు చేశారు. సమాజ్ వాదీ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ ను కూడా తాను దూరం చూసుకోబోనని ములాయం సింగ్ యాదవ్ పార్టీ వేదికగా ప్రకటించారు.

Akhilesh, Mulayam Yadav Shout At Each Other At Party Meet

విమర్శలు తట్టుకోలేకపోతే ఎవ్వరుకూడా నాయకులు కాలేరంటూ సొంత కొడుకు అఖిలేష్ యాదవ్ కు పరోక్షంగా చురకలు అంటించారు. అధికారం ఉందని కళ్లు నెత్తికెక్కించుకోవద్దని పరోక్షంగా అఖిలేష్ యాదవ్ ను హెచ్చరించారు. ఒకదశలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

భావోద్వేగానికి గురైన ములాయం సింగ్ యాదవ్ వేదిక మీదే కంటనీరు పెట్టినట్టు సమాచారం. గతంలో తనపై విమర్శలు చేసిన అమర్ సింగ్ ను నెత్తిన పెట్టుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే కొందరు నాయకులు కావాలనే తండ్రీ కొడుకుల మధ్య గొడవలు పెట్టారని సమాజ్ వాదీ పార్టీ నాయకులు అంటున్నారు.

సమాజ్ వాదీ పార్టీ సమావేశం ప్రారంభానికి ముందు అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్రమశిక్షణ ఉల్లఘించే వారిని ఉపేక్షించబోమని మాజీ మంత్రి, ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ హెచ్చరించారు.

అయితే తనకు వేరే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, తన తండ్రి కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్
యాదవ్ ప్రకటించారు. సమావేశం ముగిసిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఇంటికి అఖిలేష్ యాదవ్ వెళ్లారు. సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన పరిణామాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

English summary
Mulayam Singh has made it clear that Shivpal Yadav and Amar Singh will continue to play significant roles in the party he heads. I can't leave Amar Singh or Shivpal Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X