దేశ రాజధానిలో అల్‌ఖైదా ఉగ్రవాది అరెస్ట్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధమున్న ఓ ఉగ్రవాదిని దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఉగ్రవాది రజా ఉల్‌ అహ్మద్‌ నేపాల్‌ పారిపోతుండగా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్.. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సార్‌ బంగ్లా సభ్యుడు.

అహ్మద్‌ గురువారం ఢిల్లీ నుంచి నేపాల్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా..పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బెంగాల్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలో ఓ నకిలీ కరెన్సీ రాకెట్‌ కేసులోనూ అహ్మద్‌ నిందితుడిగా ఉన్నాడు.

Al-Qaeda terrorist arrested in Delhi

అన్సార్‌ బంగ్లా.. అల్‌ఖైదాకు అనుబంధ సంస్థ. ఈ సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు నకిలీ పత్రాలతో భారత్‌లోకి చొరబడి.. అల్‌ఖైదా తరఫున పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన తర్వాతి రోజే ఉగ్రవాది అహ్మద్ అరెస్టవడం గమనార్హం.

Alert in Sambhal, after Al Qaeda terrorists nabbed in Delhi and Cuttack

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A terrorist linked to the al-Qaeda has been arrested by the Delhi police. The police say that he was trying to escape to Nepal when he was arrested.
Please Wait while comments are loading...