వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు జోక్యంతో వీసీ వెనక్కి: అమ్మాయిలకు ఓకే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆలీగఢ్ ముస్లిం వైస్ ఛాన్సలర్ లెప్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఎట్టకేలకు దిగొచ్చారు. తమ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ గ్రంధాలయంలోకి విద్యార్ధినులను అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు.

లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తే, అంతకుముందు వచ్చే అబ్బాయిల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వస్తారని, అప్పుడు అక్కడ స్థలం సరిపోదంటూ ఇంతకుముందు ఆయన విద్యార్ధినుల ప్రవేశాన్ని ఆయన అడ్డుకున్నారు. వైస్ ఛాన్సిలర్ నిర్ణయంపై జాతీయ మహిళా కమీషన్ సహా అనేక మహిళా సంఘాలు మండిపడ్డాయి.

Aligarh Muslim University Library Will Now be Open to Women

గతంలో ఎంతో మంది ఒత్తిడి తెచ్చినా తలొగ్గని వైస్ ఛాన్సలర్ జమీరుద్దీన్ షా స్వయంగా అలహాబాద్ హైకోర్టు కలగజేసుకోని మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు దిగివచ్చారు. తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన మౌలానా అజాద్ లైబ్రరీలోకి విద్యార్థినులను కూడా అనుమతిస్తామని చెప్పారు.

English summary
Under pressure from the Allahabad High Court, the Aligarh Muslim University has agreed to open its Maulana Azad library - one of the best in Asia - to women students and provide extra security in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X