వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే కూటమి విఫలం :కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు, ఆర్ ఎల్ డి పొత్తు లేదన్న సమాజ్ వాదీ పార్టీ

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తాము పొత్తు పెట్టుకొంటామని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఆర్ ఎల్ డి తో తాము ఎలాంటి పొత్తు ఉండబోదని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తాము పొత్తు పెట్టుకొంటామని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఆర్ ఎల్ డి తో తాము ఎలాంటి పొత్తు ఉండబోదని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకొంటుందని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.అయితే ఆర్ ఎల్ డి తో తాము ఇప్పటివరకు ఎలాంటి చర్చలు చేయలేదని ఆ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల పొత్తు ఉంటుందని సమాజ్ వాదీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు.

ఆర్ ఎల్ డి కూడ ఇదే కూటమితో వెళ్ళాలని భావిస్తోంది.అయితే ఈ విషయమై ఆర్ ఎల్ డి తో పొత్తు ఉండదని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ ఎల్ డి కూడ ఈ కూటమిలో చేరితే జాట్ల ఓట్లు కూడ ఈ కూటమి వైపు మళ్ళే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు.

కాంగ్రెస్ తోనే పొత్తుకు సమాజ్ వాదీ పార్టీ సై

కాంగ్రెస్ తోనే పొత్తుకు సమాజ్ వాదీ పార్టీ సై

సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఆర్ ఎల్ డి కూడ ఈ కూటమిలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.అయితే ఈ ప్రచారాలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ తోనే తాము పొత్తు పెట్టుకొంటామని ఆ పార్టీ ప్రకటించింది.ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ అధికారికంగా ఈ ప్రకటనచేసింది. సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్మయి నందా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆర్ ఎల్ డి తో తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.

మూడు వందల స్థానాల్లో ఎస్ పి పోటీ

మూడు వందల స్థానాల్లో ఎస్ పి పోటీ

ఈ ఎన్నికల్లో మూడు వందల స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీచేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో నాలుగువందల అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నాలుగు వందల అసెంబ్లీ స్థానాల్లో మూడు వందల స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీచేయనుంది. మిగిలిన వంద స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనుంది. అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సమాజ్ వాదీ పార్టీ కేటాయించనుంది. 85 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కు ఇవ్వాలని ఎస్ పి భావిస్తోంది.అయితే వంద స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు వంద స్థానాలను కాంగ్రెస్ కు కేటాయించే అవకాశం ఉంది.

సీనియర్ నాయకులతో అఖిలేష్ ఆరుగంటలపాటు చర్చలు

సీనియర్ నాయకులతో అఖిలేష్ ఆరుగంటలపాటు చర్చలు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అఖిలేష్ భావిస్తున్నారు. పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకొన్న తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కుదుర్చుకోవాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం నాడు పార్టీ సీనియర్లతో సుమారు ఆరుగంటలపాటు అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏ ఏ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలి, ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు ఏమిటనే విషయమై చర్చించారు.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కుదుర్చుకోవాలని ఎస్ పి నిర్ణయం తీసుకొంది.

ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినందునే ఆర్ ఎల్ డి తో పొత్తుకు దూరం

ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినందునే ఆర్ ఎల్ డి తో పొత్తుకు దూరం

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ ఎల్ డి తో పోత్తు వ్యవహరానికి బ్రేక్ వేసింది సమాజ్ వాదీ పార్టీ. సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తోనే పొత్తును కుదుర్చుకోనుంది.ఆర్ ఎల్ డి ఎక్కువ సీట్లను డిమాండ్ చేసినందున ఈ పొత్తుకు ఆ పార్టీ చెక్ పెట్టిందని ఎస్ పి పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడి హోదాలో శివపాల్ యాదవ్ బహిష్కరించిన నాయకులను అఖిలేష్ యాదవ్ తిరిగి పార్టీలోకి చేర్చుకొన్నారు.

English summary
allinace with congress party only , not rld said samajwadi party on thursday, uttarpradesh cm akhilesh yadav meeting with senior leaders six hours on thursday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X