వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి బిగ్ ప్లాన్: శశికళకు చెక్, రజనీకాంత్ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?

సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం ఖాయమయిందని అంటున్నారు. ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. రజనీ రాజకీయాల్లో చేరడమే కాదు, కొత్త పార్టీని పెట్టనున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం ఖాయమయిందని అంటున్నారు. ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. రజనీ రాజకీయాల్లో చేరడమే కాదు, కొత్త పార్టీని పెట్టనున్నారు.

ఎంట్రీకి పదును పెడుతున్న తలైవా: బెంగళూరు ఏజెన్సీతో రజనీ చర్చలు..ఎంట్రీకి పదును పెడుతున్న తలైవా: బెంగళూరు ఏజెన్సీతో రజనీ చర్చలు..

రజనీ కోసం ఏళ్లుగా ఎన్నో పార్టీలు ప్రయత్నించాయి. ఆయన మద్దతు కోసం ఉబలాటపడ్డాయి. ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల మేరకు రజనీకాంత్ బిజెపిలో చేరడం లేదు.

రజనీకాంత్ పార్టీ రూపుకు బిజెపి నేతల సహకారం

రజనీకాంత్ పార్టీ రూపుకు బిజెపి నేతల సహకారం

అయితే, బిజెపి పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారని అంటున్నారు. రజనీ కొత్త పార్టీకి తుది రూపు ఇచ్చేందుకు బిజెపి నేతలు కొందరు సహకరిస్తున్నారని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ కూడా పని చేస్తోంది.

బిజెపితో పొత్తు

బిజెపితో పొత్తు

2019 లోకసభ ఎన్నికల్లో తన కొత్త పార్టీతో రజనీకాంత్ పోటీ చేయవచ్చునని అంటున్నారు. ఇప్పుడు పార్టీ పెడుతున్న రజనీ.. లోకసభ ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకుంటారని అంటున్నారు.

శశికళ, స్టాలిన్‌లకు చెక్ చెబుతారా?

శశికళ, స్టాలిన్‌లకు చెక్ చెబుతారా?

ఎన్నాళ్లుగానో తమిళనాట పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. జయలలిత మృతి అనంతరం పావులు కదపడం వేగవంతం చేసింది. అయితే శశికళ వల్ల ఆ పావులు విఫలమవుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలైన డీఎంకేకు, అన్నాడీఎంకేకు షాకిస్తూ బిజెపి తెరపైకి రజనీని తీసుకు వచ్చిందంటున్నారు. పన్నీరుసెల్వం ఎలాగు బిజెపికి అనుకూలంగా ఉన్నారు. శశికళ వర్గానికి రజనీతో బిజెపి చెక్ చెప్పడానికి సిద్ధమయిందని అంటున్నారు. అయితే ఇటీవల స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ.. మంచి మిత్రుడు అన్నారు రజనీకాంత్. ఆ వ్యాఖ్యలు వ్యూహాత్మకం కావొచ్చంటున్నారు.

రజనీ పార్టీలోకి 5గురు శశికళ వర్గం ఎమ్మెల్యేలు

రజనీ పార్టీలోకి 5గురు శశికళ వర్గం ఎమ్మెల్యేలు

ఇదిలా ఉండగా, రజనీకాంత్ పార్టీ పెడతారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగానే ఆయనకు మద్దతు పెరుగుతోంది. అంతేకాదు, పలువురు ఆయన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శశికళకు షాకిస్తూ.. అన్నాడీఎంకేలోని ఐధుగురు ఎమ్మెల్యేలు రజనీ పార్టీకిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

English summary
ADMK sources said that 5 MLAs who are supporting Chief Minister Edappaadi Palanisamy now ready to join Rajinikanth's new political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X