వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజినీకి చిరంజీవి ఫెయిల్యూర్ గుర్తు చేసిన అమితాబ్: ఎందుకంటే..?

రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రోజుకో వార్త వెలువడుతూనే ఉంది. మరోసారి అభిమానులతోపాటు సమావేశమైన తర్వాతే రజినీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రోజుకో వార్త వెలువడుతూనే ఉంది. ఇంతవరకు ఆయన అధికారికంగా ఎలాంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో ఎవరికి తోచిన వార్తలను వారు ప్రచారం చేస్తున్నారు. మరోసారి అభిమానులతోపాటు సమావేశమైన తర్వాతే రజినీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నిక: తొలి ఓటు చిరంజీవిదే, మరో విశేషం కూడా..రాష్ట్రపతి ఎన్నిక: తొలి ఓటు చిరంజీవిదే, మరో విశేషం కూడా..

ఫ్యామిలీలో ఆందోళన

ఫ్యామిలీలో ఆందోళన

అయితే, రాజకీయ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి ఆయన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని రజనీ కుటుంబీకులు ఆందోళన చెందుతున్న విషయం కూడా తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లకుండానే అభిమానుల, సేవా సంఘాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని వారు రజినీని కోరుతున్నారు.

అమితాబ్‌తో భేటీ

అమితాబ్‌తో భేటీ

ఈ క్రమంలో, మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలో తన తాజా చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ను రజనీకాంత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు.

చిరంజీవి ఫెలయ్యారు..

చిరంజీవి ఫెలయ్యారు..

రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా రజనీకి అమితాబ్ వివరించారు. అంతేగాక, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి... రాజకీయాల్లో ఎలా విఫలమయ్యారనే విషయాన్ని కూడా అమితాబ్ గుర్తు చేశారు.

దేవుడు శాసిస్తాడా..?

దేవుడు శాసిస్తాడా..?

ఈ నేపథ్యంలో, రాజకీయాల్లో తనకు ఎదురయ్యే సమస్యలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై రజనీకాంత్ ఇప్పుడు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబసభ్యులు, అమితాబ్ సూచనలతో రజినీ రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక దేవుడు శాసించాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడంటూ రాజకీయాల్లోకి అడుగుపెడతాడా? అనేది రజినీయే వెల్లడించాల్సి వుంది.

English summary
It is said that Bollywood Megastar Amitabh Bachchan given a suggestion to Superstar Rajinikanth on politics entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X