వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న చర్చి, నిన్న గుడిలో అనిల్ అంబానీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన స్వఛ్ భారత్ ప్రచార కార్యక్రమానికి అనిల్ అంబానీ మరింతగా ముందు తీసుకుపోతున్నారు. రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఆదివారం బద్రీనాథ్, కేదర్నాథ్ ఆలయ ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేశారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బద్రీనాథ్, కేదర్నాథ్ దేవుళ్ల దీవెనలు అందుకోవడం, రెండోది ఈ దేవాలయాల పరిసరాలను శుభ్రం చేయడమని అన్నారు. మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలు ఆలయాలతో ఎంతో ముడిపడి వున్నాయన్నారు. వాటిని కాపాడుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ప్రతి ఒక్కరు నేటి నుంచే ఈ బాధ్యత తీసుకోవాలని, అప్పుడే స్వఛ్ భారత్ మిషన్ విజయవంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా పాల్గొన్నారు. అంతక ముందు కూడా ప్రధాని మోడీ పిలుపు మేరకు అనిల్ అంబానీ ముంబైలోని చర్చిగేటు సమీపంలో తన బృందంతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. చర్చిగేటు వద్ద రోడ్డును శుభ్రం చేయడానికి అనిల్ అంబానీ, అతడి స్నేహితుల కృషి అద్బుతమని ప్రధాని మోడీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.

గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన స్వఛ్ భారత్ ప్రచార కార్యక్రమానికి అనిల్ అంబానీ మరింతగా ముందు తీసుకుపోతున్నారు. రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఆదివారం బద్రీనాథ్, కేదర్నాథ్ ఆలయ ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేశారు.

 గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బద్రీనాథ్, కేదర్నాథ్ దేవుళ్ల దీవెనలు అందుకోవడం, రెండోది ఈ దేవాలయాల పరిసరాలను శుభ్రం చేయడమని అన్నారు.

 గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలు ఆలయాలతో ఎంతో ముడిపడి వున్నాయన్నారు. వాటిని కాపాడుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరు నేటి నుంచే ఈ బాధ్యత తీసుకోవాలని, అప్పుడే స్వఛ్ భారత్ మిషన్ విజయవంతమవుతుందన్నారు.

 గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

గుడిలో మళ్లీ చీపురుపట్టిన అనిల్ అంబానీ

అంతక ముందు కూడా ప్రధాని మోడీ పిలుపు మేరకు అనిల్ అంబానీ ముంబైలోని చర్చిగేటు సమీపంలో తన బృందంతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. చర్చిగేటు వద్ద రోడ్డును శుభ్రం చేయడానికి అనిల్ అంబానీ, అతడి స్నేహితుల కృషి అద్బుతమని ప్రధాని మోడీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Taking forward Prime Minister Narendra Modi's initiative to rid the country of litter and rubbish, Reliance Group chairman Anil Ambani today cleaned the Badrinath and Kedarnath temple premises and area around it to spread the message of 'Swachh Bharat'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X