చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు పెరుమాళ్ మురుగన్: ఇప్పుడు మరో రచయిత

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో మరో రచయితపై దాడి జరిగింది. తీవ్రమైన నిరసనలు, దాడుల బెదిరింపుల మధ్య రచయితగా తాను మరణించానని పెరుమాళ్ మురుగన్ అనే తమిళ రచయిత ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తమ వర్గాన్ని అవమానించాడంటూ కొంత మంది చెన్నైలో మరో రచయితపై దాడి చేశారు.

పుల్లియూర్ మురుగేసన్ అనే కథా రచయితపై కొంగు వెల్లలార్ కమ్యూనిటీకి చెందినవారు దాడి చేశారు. ఆ కథా సంకలనంపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. ఆ రచయిత కథలతో తాము తీవ్రమైన వేదనకు గురైనట్లు వారు చెబుతున్నారు.

Another Author in Tamil Nadu Attacked for Book

పుల్లియూర్ మురుగేసన్ అనే రచయిత తన బాలచంద్రన్ ఎన్రా పెయరుమ్ ఎనక్కుందు అనే కథను ట్రాన్స్‌జెంజర్స్ సమస్యలను తీసుకుని రాశారు. మురుగేసన్‌పై దాడి చేసిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

రచయిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తీవ్రమైన గాయాలేవీ కాలేదు. ఈ ఆందోళనకారులే హిందూ గ్రూపులతో కలిసి పెరుమాళ్ మురుగన్‌ను వేదనకు గురి చేసినట్లు చెబుతున్నారు అన్ని పుస్తకాలను, కథలను, కవిత్వాన్ని కూడా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Last month, Tamil author Perumal Murugan's self-proclaimed "death" following protests against his books spurred a debate about freedom of expression. Now another author has been attacked in Chennai by activists who allege that his book has portrayed their community in poor light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X