బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, నెలకు రూ. 3 లక్షలు డీల్, మూడు రోజుల్లో అధికారి ఔట్ , ఎంత ఫాస్ట్ !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దెబ్బకు ఎప్పుడు ఏ అధికారి బదిలి అవుతారో అనే ఆందోళనతో జైళ్ల శాఖ అధికారులు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దెబ్బకు ఎప్పుడు ఏ అధికారి బదిలి అవుతారో అనే ఆందోళనతో జైళ్ల శాఖ అధికారులు హడలిపోతున్నారు.

సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ వేసుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని హల్ చల్, ఈ వీడియోలో !సెంట్రల్ జైల్లో శశికళ చుడిధార్ వేసుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని హల్ చల్, ఈ వీడియోలో !

సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చీఫ్ సూపరెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. అనితను గురువారం (జులై20) ధారవాడ సెంట్రల్ జైలుకు బదిలి చేశారు. శశికళ దెబ్బకు మూడు రోజుల్లోనే డాక్టర్ ఆర్. అనిత బదిలి కావడంతో జైళ్ల శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఇంత కాలం చక్రం తిప్పి చివరికి !

ఇంత కాలం చక్రం తిప్పి చివరికి !

ఇతకాలం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ గా చక్రం తిప్పిన కృష్ణకుమార్ ను కులబర్గి సెంట్రల్ జైలుకు బదిలి చేశారు. కులబర్గి సెంట్రల్ జైలు చీఫ్ సూపరెండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సోమశేఖర్ ను బెంగళరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారిగా బదిలి చేశారు.

నెలకు మూడు రూ. లక్షలు డీల్ !

నెలకు మూడు రూ. లక్షలు డీల్ !

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ గా డాక్టర్ ఆర్. అనితను బదిలి చేసిన వెంటనే ఆమెను టీటీవీ దినకరన్ సంప్రధించారని తెలిసింది. శశికళకు ఎలాంటి పమస్యలు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తే నెలకు రూ. మూడు లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని సమాచారం.

ఖైదీల ఆందోళన !

ఖైదీల ఆందోళన !

ఈ విషయం జైల్లో శశికళ ఓ మహిళా గార్డుతో చెప్పడం, ఆ విషయం అందరికి తెలిసిపోవడం వెంటవెంటనే జరిగిపోయింది. ఈ విషయం తెలసుకున్న అక్కడి ఖైదీలు వెంటనే అనితను బదిలి చెయ్యాలని జైల్లో ఆందోళనకు దిగారు.

ఖైదీలు ఎదురుతిరిగితే !

ఖైదీలు ఎదురుతిరిగితే !

అనిత విషయం తెలుసుకున్న ప్రభుత్వం మళ్లీ సమస్య వచ్చి నెత్తినపడుతోందని, శశికళ రాచమర్యాదల విషయంలో రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతున్న సమయంలో ఖైదీలు ఎదురుతిరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

మూడు రోజుల్లో ఔట్ ?

మూడు రోజుల్లో ఔట్ ?

కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల్లోనే డాక్టర్ అనితను ధారవాడ సెంట్రల్ జైలుకు బదిలి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఖైదీలు శశికళ అక్రమాలను అడ్డుకోవడానికి సిద్దం అయ్యారు.

మన్నార్ గుడి మాఫియా ఎంత ఫాస్ట్ !

మన్నార్ గుడి మాఫియా ఎంత ఫాస్ట్ !

మూడు రోజుల్లో శశికళ సౌకర్యాల కోసం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ కు లంచం ఎరవేసి బుట్టలో వేసుకోవడంతో మన్నార్ గుడి మాఫియా జైల్లో చిన్నమ్మకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంత ఫాస్ట్ గా ప్లాన్ వేస్తున్నారో మరో సారి వెలుగు చూసింది.

ప్రభుత్వం పరువు పోతుందని

ప్రభుత్వం పరువు పోతుందని

శశికళ విషయాలు ఇక ముందు ఏమాత్రం బయటకు రాకుండా చూడాలని, ప్రభుత్వానికి, కర్ణాటకకు చెడ్డపేరు వస్తోందని సిద్దరామయ్య ప్రభుత్వం అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా మన్నార్ గుడిమాఫియా మాత్రం చిన్నమ్మ సౌకర్యాల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్దం అయ్యింది.

English summary
Karnataka Government has transfered another officer from Parappana Agruhara in connection with Parappana Agruhara corruption case which had exposed by former DIG (prison) Roopa D Moudgil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X