వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"అమ్మాయి-అబ్బాయి ఎప్పటికీ స్నేహితులు కాదు.. వీధుల్లో వద్దు, ఇంటికెళ్లండి!"

'ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎన్నటికీ స్నేహితులు కాదు' అన్న విషయం గుర్తుంచుకోవాలని ఓ యువకుడికి ఉత్తరప్రదేశ్ యాంటీ రోమియో స్క్వాడ్ హితబోధ చేశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కబేళాలలను మూసివేయడంతో పాటు, పలు హోటల్స్ పై రైడ్ చేయించడం, యాంటీ రోమియో స్క్వాడ్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.

ఉత్తరప్రదేశ్ లో యాంటీ రోమియో స్క్వాడ్ గా పిలుస్తున్న ఈ టీమ్స్ ఇప్పటికీ షీ టీమ్స్ పేరిట పలు రాష్ట్రాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మోరల్ పోలిసింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏకంగా ఒక అమ్మాయి, అబ్బాయి ఎన్నటికీ స్నేహితులు కాదు.. కాబట్టి వారు బహిరంగ ప్రదేశాల్లో కలుసుకోవద్దన్న సంకేతాలను అక్కడి పోలీసులు పంపిస్తున్నారు.

ఇదే నేపథ్యంలో యాంటీ రోమియో స్క్వాడ్ పనితీరును తెలుసుకునేందుకు ఓ జాతీయ మీడియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఈ టీమ్స్ పనితీరును ఒకరోజంతా పరిశీలించి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. తాజాగా ఆ కథనం బయటకు రావడంతో చాలామంది ఈ మోరల్ పోలిసింగ్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రోమియోను ఇలా గుర్తిస్తాం:

రోమియోను ఇలా గుర్తిస్తాం:

సాధారణంగా అమ్మాయిలను అల్లరిపెట్టే ఆకతాయి యువకులను పోలీసులు ఎలా గుర్తిస్తారన్న సందేహం రావచ్చు. దీనికి ఉత్తరప్రదేశ్ యాంటీ రోమియో స్క్వాడ్ చెబుతున్న సమాధానం కాస్త విచిత్రంగానే ఉంది. ' పలానా వ్యక్తి రోమియో అని ఎవరి ముఖం రాసి ఉండదు, కానీ మేం వారి కళ్లను చూసి చెప్పేయగలం' అంటూ ఓ కానిస్టేబుల్ చెప్పడం గమనార్హం.

అబ్బాయి, అమ్మాయి ఎప్పటికీ స్నేహితులు కాదు:

అబ్బాయి, అమ్మాయి ఎప్పటికీ స్నేహితులు కాదు:

ఒక మహిళా కళాశాల గేటు ముందు ఎవరి కోసమో ఎదురుచూస్తున్న ఒక యువకుడి వద్దకు యాంటీ రోమియో స్క్వాడ్ వెళ్లింది. ఇక్కడేం చేస్తున్నావని అతన్ని పోలీసులు ప్రశ్నించారు. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చానని అతను సమాధానం చెప్పడంతో.. 'ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎన్నటికీ స్నేహితులు కాదు' అన్న విషయం గుర్తుంచుకోవాలని అతనికి హితబోధ చేశారు.

'మీరు నిజంగా స్నేహితులైతే అమ్మాయి ఇంటికి వెళ్లు.. వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అమ్మాయితో మాట్లాడు.. అంతేగానీ వీధుల్లో తిరిగి ఇక్కడి వాతావారణం పాడుచేస్తే ఊరుకోబోం' అని యాంటీ రోమియో స్క్వాడ్ యువకున్ని హెచ్చరించింది.

షాప్ ముందున్న యువతిని:

షాప్ ముందున్న యువతిని:

ఓ కోచింగ్ సెంటర్ వద్ద వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో యాంటీ రోమియో స్క్వాడ్ ఆ దిశగా వెళ్లింది. అదే సమయంలో ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న యువకుడిని ఇక్కడేం చేస్తున్నావంటూ హెచ్చరించి.. అక్కడినుంచి పంపించేశారు.

ఆ పక్కన్నే ఒక పుస్తకాల దుకాణం ఎదుట నిలుచున్న మహిళను సైతం ప్రశ్నించారు. 'ఇక్కడేం చేస్తున్నావు?, సమస్యేమైనా ఉందా?' అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ మహిళలో కొంత భయం కనిపించింది. వెంటనే పక్కన ఉన్న తన కుమారుడిని గట్టిగా పట్టుకుని అలాంటిదేమి లేదని బదులిచ్చింది.

 'రోమియో' అన్న పదం ఎక్కడిది?:

'రోమియో' అన్న పదం ఎక్కడిది?:

ఒక కాలేజీ బయట నిలుచున్న విద్యార్థులను, ఇక్కడెందుకు నిలుచున్నారంటూ అక్కడినుంచి పంపించేశారు. వారి ఫోటోలు తీసి హెచ్చరించారు. అదే సమయంలో అసలు రోమియో అన్న పదం ఎక్కడినుంచి వచ్చిందన్న చర్చ వారిలో మొదలైంది. బ్రిటీష్ వ్యక్తి పేరని కొందరు, కాదు గ్రీస్, ఇంగ్లాండ్ లకు చెందిన వ్యక్తులని కొంతసేపు చర్చ జరిగింది.

అనంతరం ఎస్పీ అలోక్ ప్రియదర్శిని మాట్లాడుతూ.. మోరల్ పోలీసింగ్ పేరుతో తామెవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, మహిళా భద్రతే తమకు ముఖ్యమని అన్నారు.

English summary
From Gorakhpur to Meerut, ‘anti-Romeo’ squads of policemen on Wednesday fanned out across Uttar Pradesh on the orders of new chief minister Yogi Adityanath, fulfilling a pre-poll pledge of the BJP to check eve-teasing. But the police campaign aimed at ensuring safety of women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X