వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి బిల్లుపై అసెంబ్లీ నిర్ణయం, వచ్చాక పంపిస్తాం: షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి, మంత్రుల బృందం (సభ్యులు) సుశీల్ కుమార్ షిండే గురువారం న్యూఢిల్లీలో అన్నారు. విభజన నిర్ణయంతో పార్లమెంటు సమావేశాలు వేడెక్కడం, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

రాష్ట్రపతి నుండి తెలంగాణ బిల్లు రాగానే తాము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు. ఎపి శాసన సభ బిల్లు పైన ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శాసన సభ అభిప్రాయం తర్వాత తాము మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. కేబినెట్ నిర్ణయం అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. తెలంగాణ బిల్లు తన వద్దకు రాగానే అసెంబ్లీకి పంపిస్తానని చెప్పారు.

కాగా, అవిశ్వాస తీర్మానం హోరు, విపక్షాల జోరు, మిత్రపక్షాలతోనూ పోరు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ లోక్‌సభ చరిత్రలో అతి సంక్షిప్త సమావేశాలను మరింత సంక్షిప్తం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

అవిశ్వాసంపై చర్చకు తగిన సంఖ్యాబలాన్ని సీమాంధ్ర ఎంపీలు సంపాదించడం, అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు, 2జీ, బొగ్గు కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బిజెపి నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. వీటన్నింటికీ ఏకైక పరిష్కారంగా సభను వారం ముందుగానే నిరవధిక వాయిదా వేయాలని భావిస్తోందట. ఇప్పటికే 13 మంది సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, దీన్ని సమర్థించడానికి శివసేన, అకాలీదళ్, బిజెడి సిద్ధమయ్యాయి.

English summary
Union Home Minister and GoM Member Sushil Kumar Shinde on Thursday said the AP Assembly will take a decision on Telangana Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X