వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదుల దాడి: ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరుల మృతి

|
Google Oneindia TeluguNews

 Army Officer, 3 Civilians Killed As Militants Enter Bunker in JandK
జమ్మూకాశ్మీర్: కాశ్మీర్ సరిహద్దులో మరోసారి ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఒక జవాను, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం జరిపిన ఎదురు దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

జమ్మూ కశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్ లో ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. ఆర్మీ బంకర్లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు, ఉగ్రవాదుల మధ్య తుపాకుల మోత మోగుతోంది. ఈ ఉగ్రవాదులు బుధవారం రాత్రే బంకర్లలో చొరబడినట్లు అనుమానిస్తున్నారు.

నలుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో సరిహద్దుల్లోకి చొరబడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇటీవల సరిహద్దుల్లో.. ఉగ్రవాదుల చొరబాట్లు పెరగడంతో.. సైన్యం అప్రమత్తమైంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు ముగ్గురు పౌరులు మృతి చెందారు. కొందరు సైనికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాల్పుల ఘటనపై స్పందించిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నేపాల్‌లో జరుగుతున్న సార్క్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైన నేపథ్యంలో ఈ ఘటన యాధృశ్చికంగా జరగలేదని అన్నారు. కాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు ఒమర్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

కాగా, నవంబర్‌ నెలలో బడ్గావ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. ఇద్దరు యువకులు మృతి చెందారు. సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించి.. ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనలతో.. ఉగ్రవాదుల కదలికలపై... ఆర్మీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి. ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి భద్రతా చర్యలు సమీక్షిస్తున్నారు.

English summary
A Junior Commissioned Officer or JCO of the Indian Army was killed when four militants entered a reportedly abandoned Army bunker near the Pindi post, barely three kilometres from the International Border in Jammu and Kashmir's Arnia sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X