వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్నబ్ గోస్వామికి ‘వై’ కేటగిరి భద్రత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, టైమ్స్‌నౌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ఆయనకు 'వై' కేటగిరి భద్రతను సమకూర్చింది. దీంతో అర్నబ్‌కు 24 గంటల పాటు భద్రతా వలయం ఉండనుంది.

మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించనున్నారు. కాగా, వీరిలో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉన్నారు. దీనిపై స్పందించేందుకు ఆర్నాబ్‌ అందుబాటులోకి రాలేదు.

'వై' కేటగిరి కింద రెండు రకాలుగా భద్రత కల్పిస్తుంటారు. మొదటి విభాగంలో మంత్రులకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ తరహా భద్రతను కల్పిస్తారు. రెండో విభాగంలో నిఘా వర్గాలు ఎవరికైనా ముప్పు ఉందని గుర్తిస్తే.. వారికి వై కేటగిరి భద్రతను కల్పిస్తారు.

Arnab Goswami to get Y category security cover over threat from Pak-based terror groups: Report

భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో టీవీ షోల ద్వారా పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆర్నబ్‌కు పలు ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్నబ్‌కు ప్రాణాపాయం పొంచి ఉందన్న సమాచారంతో ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పించింది.

ఇది ఇలా ఉంటే, జీ న్యూస్ ఎడిటర్ ఇన్‌ చీఫ్ సుధీర్ చౌదరికి ఎక్స్ కేటగిరి, సమాచార్ ప్లస్‌కు చెందిన ఉమేష్ కుమార్ వై కేటగిరి, అశ్వినీ కుమార్ చోప్రాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అందిస్తున్నారు.

English summary
Times NOW editor-in-chief Arnab Goswami will receive “Y category” security cover from the government after the Intelligence Bureau perceived a threat to his life from “Pakistan based terrorists groups”, the Hindustan Times reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X