వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపద పన్ను రద్దు, ఆదాయం పన్ను స్లాబుల్లో మార్పు లేదు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కార్పోరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుందని చెప్పారు. ఆదాయం పన్ను స్లాబులు యధాతథంగా ఉంటాయని చెప్పారు. తన 2015-16 బడ్జెట్ ప్రసంగంలో శనివారం ఆయన ఆ విషయాలు చెప్పారు.

విదేశీ ఆస్తులు వెల్లడించకపోయినా, వివరాలు సరిగా వెల్లడించకపోయినా సమాన స్థాయిలో దేశీయ ఆస్తులను జప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నల్లధనంపై బిల్లు ప్రవేశపెడుతామని చెప్పారు. పన్ను ఎగవేతదారులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించనున్నట్లు ఆయన తెలిపారు. మనీల్యాండరింగ్ చట్టాల్లో మార్పులు సవరణలు చేయనున్నట్లు ఆయిన తెలిపారు. లక్ష రూపాయలు దాటిన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అని ఆయన చెప్పారు.

Arun Jaitley budget: No changes in income tax slabs

సంపద పన్నును రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్లధనం అరికట్టడానికి, ఉపాధి ప్రాథమ్యాలకు ప్రాధాన్యం ఇస్తాముని చెప్పారు. పన్ను వసూళ్లు 23 శాతం ఉంటాయని చెప్పారు. రూపాయి ఆదాయం లేకపోయినా విదేశీ ఆస్తులను వెల్లడించాల్సిందేనని ఆయన అన్నారు. బినామీ ఆస్తులపై కొరడా ఝళిపిస్తామని అన్నారు. రూ. లక్ష దాటిన విదేశీ ఆస్తులపై ప్రత్యేక దృష్టి పెడుతామని ఆయన అన్నారు.కోటి రూపాయల ఆదాయం దాటినవారికి అదనంగా 2 శాతం పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక సేవలపై 15 శాతం పన్ను తగ్గించారు. అది 25 శాతం నుంచి పది శాతానికి తగ్గుతుంది. వేయికి పైగా ధర కలిగిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం విధించనున్నట్లు ఆయన తెలిపారు. పాదరక్షలపై ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేశారు

ఆరోగ్య బీమాపై పన్ను రాయితీ ప్రీమియమ్‌ను రూ. 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. సిఎస్ఆర్ కింద స్వచ్ఛ భారత్‌కు ఇచ్చే విరాళాలపై వంద శాతం పన్ను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. సేవల పన్నును 14 శాతానికి తగ్గించినట్లు మంత్రి చెప్పారు.

రవాణా అలవెన్స్ కింద రూ. 1600 మినహాయించనున్నట్లు ఆయన తెలిపారు. సీనియర్ పౌరులకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీనీ 10 వేల నుంచి రూ.30 వేల రూపాయలకు పెంచినట్లు ఆయన తెలిపారు. 80 ఏళ్లు దాటినవారికి 30 వేల రూపాయల వరకు వైద్య బిల్లులను పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగులకు అదనంగా 20 వేల పన్ను రాయితీ కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పింఛన్ నిధికి చెల్లింపులపై రాయితీ ఒక లక్ష నుంచి 1.5 లక్షలలకు పెంచుతున్నట్లు తెలిపారు.

English summary
Union Finance minister Arun Jaitley announced that the income tax slabs will not be changed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X