వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దేశం.. ఒకే పన్ను: జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగింది. జీఎస్‌టీకి మద్దతు తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు సభలో ఉన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు.జీఎస్‌టీ చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది.

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో జీఎస్‌టీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఎస్‌టీ బిల్లుపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లుతో పన్ను సంస్కరణలు అమలు సాధ్యమని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లుగా జీఎస్‌టీ బిల్లుని అభివర్ణించారు. ఈ బిల్లు ఆమోదం వల్ల పలు రాష్ట్రాలకు ఉపయోగముంటుందని జైట్లీ అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలని, వస్తు, సేవల పన్ను సవరణల బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Arun Jaitley moves GST Bill in Rajya Sabha

జీఎస్‌టీ బిల్లుపై విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపామని, ఈ బిల్లుపై ఎంపిక సెలెక్ట్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు. జీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

జీఎస్‌టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని జైట్లీ పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లుకు లోక్‌సభ 2015లోనే ఆమోదం తెలిపిందని సభలో ఆయన పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లుపై రాజ్యసభలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పి. చిదంబరం మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు.

జీఎస్‌టీ బిల్లుని రాజ్యసభ తప్పక ఆమోదించాలని ఆయన తెలిపారు. జీఎస్‌టీ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన తెలిపారు. జీఎస్‌టీ బిల్లు ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించేలా ఉండాలని ఆయన సూచించారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లును తీసుకొస్తే అప్పటి ప్రతిపక్షం సహకరించలేదని ఆయన అన్నారు.

ఈ బిల్లులో భాగంగా, ఎంత పన్నును విధించనున్నారన్న విషయాన్ని స్పష్టంగా చెబితేనే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆయన మెలిక పెట్టారు. వస్తు సేవల పన్ను గరిష్ఠంగా 18 శాతం ప్రాణికంగా ఉంటేనే తమకు ఆమోదయోగ్యమని, అంతకన్నా పెంచాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకుని తీరుతామని చిదంబరం తెలిపారు.

జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు 11 ఏళ్లు పట్టిందని చిదంబరం పేర్కొన్నారు. ఈ బిల్లుని ఆమోదించడం ద్వారా అందరికీ ప్రయోజనం కలిగించాలని ఆయన కోరారు. జీఎస్‌టీ బిల్లు ద్వారా ప్రత్యక్ష పన్నులు ద్వారా ఆదాయం ఎక్కువ పొందాలని అన్నారు. అయితే, ఈ బిల్లులో ఎలాంటి లోపాలు లేవని ప్రభుత్వం అనడం సరికాదన్నారు.

గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జీఎస్ టీ బిల్లును భారతీయ జనతాపార్టీ వ్యతిరేకించిన విషయాన్ని చిదంబరం ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీఎస్‌టీ బిల్లుపై 3,4 నెలల్లో ప్రభుత్వం వైఖరి మారడం హర్షణీయమని చెప్పారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందడం ద్వారా పరోక్ష పన్నుల రేటు తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.

సభలో ఏకాభిప్రాయం ఆధారంగా జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందాలని అన్నారు. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రాకూడదని ఆయన సూచించారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా, చర్చల ద్వారా జీఎస్ టీ బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నానని చిదంబరం అన్నారు.

ఈ బిల్లుకు మరో మూడు సవరణలు చేయాల్సి వుందని, అప్పుడు మాత్రమే పూర్తి పారదర్శకతో బిల్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పన్నుల రేట్లు మార్చాలని చూస్తే, పార్లమెంటు ఆమోదంతోనే అది సాధ్యపడేలా మరో సవరణ అత్యంత కీలకమని, దాన్ని కూడా బిల్లులో చేర్చాలని చిదంబరం డిమాండ్ చేశారు.

English summary
The stage is set for the roll-out of a uniform goods and services tax (GST) regime in the Rajya Sabha today. Here are the Parliament proceedings for the day.
Read in English: Special Coverage GST Bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X