వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెజిట్ నోటిఫికేషన్‌పై కేజ్రీవాల్: బీజేపీ ఓడిపోయింది, కేంద్రం వెన్నుపోటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలియజేస్తూ హోం శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వానికి నోటిఫికేషన్ జారీ చేయడం వారి భయానికి నిదర్శమని అన్నారు.

తమ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి వ్యతిరేక విధానాలపై కేంద్రానికి భయం పట్టుకుందని అన్నారు. 'బీజేపీ తొలుత ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వానికి నోటీసులిచ్చి మళ్లీ ఓడిపోయింది' అని ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో అధికారుల నియామకం, బదిలీల్లో గతంలో ఉన్న అవినీతికి అడ్డుకట్ట వేశామని, అవినీతిపై పోరాడుతున్నందుకే తమని లక్ష్యంగా చేసుకున్నారని గవర్నర్ నజీబ్ జంగ్‌ను పావుగా వాడుకుంటున్నారని కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.

ఢిల్లీ ప్రజలకు కేంద్రం వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, నియామకాలపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఢిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పరోక్షంగా అధికారం చెలాయించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శకుంతల గామ్లిన్‌ని నియమించడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య మొదలైన వివాదం పెద్దదై చివరకు రాష్ట్రపతి వరకు చేరింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్యదర్శిని ఎలా నియమిస్తారంటూ అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నించగా, రాజ్యాంగం ప్రకారం తనకు ఆ అధికారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

Arvind Kejriwal

ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్‌ స్థానంలో అరవింద్‌రేని నియమిస్తూ కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఆప్ ప్రభుత్వం చేసిన బదిలీలు, నియామకాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రం ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు.

ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్టినెంట్ గవర్నర్ నియామకాలు, బదిలీలు చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం ఇద్దరూ కూర్చుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

ఢిల్లీ వివాదంపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ జోక్యంతోనే హోం శాఖ శుక్రవారం గవర్నర్ విశిష్ట అధికారాలను తెలుపుతూ ఢిల్లీ ప్రభుత్వానికి ఈ గెటిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

English summary
Delhi CM Arvind Kejriwal today attacked the Modi government over MHA notification which said that Delhi LG has primacy in the issue of transfer and posting of bureaucrats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X