వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: రాహుల్‌తో జెడియూ నేత శరద్ యాదవ్ భేటీ, పార్టీలో చీలిక?

బీహర్‌లో క్షణాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఆరవసారి బీహర్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వ్యవహరం నచ్చిన కొందరు పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహర్‌లో క్షణాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఆరవసారి బీహర్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వ్యవహరం నచ్చిన కొందరు పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జెడియూ కీలకనేత శరద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపిలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

కీలక మలుపు: నేడు సీఎంగా నితీష్ ప్రమాణం, చక్రం తిప్పిన మోడీ!కీలక మలుపు: నేడు సీఎంగా నితీష్ ప్రమాణం, చక్రం తిప్పిన మోడీ!

బీహర్‌లో మహకూటమి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్..లాలూతో పాటు ఆయన కొడుకు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయాలని కోరారు.

As Nitish Kumar takes oath, Sharad Yadav meets Rahul Gandhi, calls MPs meet

అయితే రాజీనామా చేసేందుకు తేజస్వి యాదవ్ ససేమిరా అన్నారు.ఇదే విషయాన్ని లాలూ కుండబద్దలు కొట్టారు.దీంతో బుదవారం సాయంత్రం నితీష్ తన పదవికి రాజీనామా చేశారు.

బిజెపి మద్దతుతో గురువారంనాడు ఆయన 6వ, దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నితీష్ బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఆ పార్టీ కీలకనేత శరద్ యాదవ్ గురువారంనాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. శరద్‌యాదవ్ రాహుల్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

అత్యవసరంగా శరద్ యాదవ్ పార్టీ ఎంపిల సమావేశాన్ని కూడ ఏర్పాటుచేశారు. మరో వైపు జెడియూ ఎమ్మెల్యేలు కూడ బిజెపితో మైత్రిని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ తరుణంలో పార్టీలో చిలీక వచ్చేఅవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

అయితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం లేదని ఆ పార్టీ ప్రకటించింది. తామంగా సమైఖ్యంగా ఉన్నామని ఆ పార్టీ ప్రకటించింది. బిజెపితో నితీష్ చేతులు కలపడాన్ని కేరళశాఖ తీవ్రంగా ఖండించింది. రాజ్యసభసభ్యుడు, ఆ పార్టీ కేరళశాఖ అధ్యక్షుడు వీరేంద్రకుమార్ నితీష్‌పై నిప్పులు చెరిగారు.

రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొనేందుకు సిద్దమేనని ప్రకటించారు. ఫాసిస్టు శక్తులతో పోరాడేందుకు తాను ఎంత మూల్యాన్నైనా చెల్లించేందుకు సిద్దమేనని చెప్పారు.

English summary
Nitish Kumar's decision to join hands with the Bharatiya Janata Party again in Bihar has upset his senior party leader Sharad Yadav. Yadav met Congress Vice President Rahul Gandhi in Delhi today. The meeting took place soon after Nitish was sworn-in as Bihar CM for the sixth time in Patna. Yadav has also called a meeting this evening with party leaders and MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X