వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీలో కర్ణాటక లోకాయుక్త పుత్రుడిపై కేసు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడి మీద తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైన విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న పలు కన్నడ సంఘాలు వెంటనే భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి.

లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్‌పై ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించి రూ. ఒక కోటి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

Ashwin Rao:cheating case in Vikarabad police station in Telangana

అయితే అశ్విన్ రావ్ 2008లో అతని స్నేహితుడితో కలిసి వికారాబాద్ లో 16 ఎకరాల భూమిని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.33 లక్షలుకు విక్రయించారని వెలుగు చూసింది. అయితే ఆ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు తమకు నకిలి పత్రాలు ఇచ్చి భూములు విక్రయించారని వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వికారాబాద్ పోలీసులు 2008 జులై 13న అశ్విన్ రావ్, అతని స్నేహితుడు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారని వెలుగు చూసింది. ఈ కేసులో శ్రీనివాస్ మొదటి ముద్దాయి, అశ్విన్ రావ్ రెండవ ముద్దాయి. అశ్విన్ రావ్ ను రిమాండ్ కు తరలించారని, తరువాత ఆయన జామీను తీసుకుని బయటకు వచ్చాడని వెలుగు చూసింది.

English summary
Ashwin Rao son of Lokayukta Justice Bhaskar Rao was arrested and charge-sheeted for forgery and cheating case in Andhra Pradesh (Telangana) in 2008. FIR was registered against Ashwin and 6 others in Vikarabad police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X