వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోడో తీవ్రవాదులు దాడి: 68కు చేరిన మృతులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అస్సాం: అస్సాంలోని సోనిట్ పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో నాలుగు చోట్ల బోడో తీవ్రవాదులు చేసిన దాడుల్లో మృతుల సంఖ్య 68 మందికి చేరింది. తీవ్రవాదులు దాడికి ఆగ్రహించిన అదివాసీలు, స్దానికులు కొన్ని చోట్ల ఎదురు దాడులకు దిగుతున్నారు.

దీంతో బోడో తీవ్రవాదుల ఇళ్లకు నిప్పంటించారు. వారికి వ్యతిరేకంగా ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు జరిపిన దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దాడి నేపథ్యంలో అస్సాం పోలీసులు బోడోలపై ఉక్కుపాదం మోపగా, రాష్ట్ర బలగాలకు మరింత దన్నుగా నిలిచేందుకు కేంద్రం అదనపు బలగాలను అస్సాంకు పంపింది.

5 వేల మంది పారామిలిటరీ బలగాలను అసోంకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ‘‘అమాయకులైన గిరిజనులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించక తప్పదు'' అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

దాడి జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు వెళుతున్న హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అస్సాం ముఖ్యమంత్రితో తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రజల్లో భయానకర వాతావరణం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే దాడులకు తెగబడ్డారని వ్యాఖ్యానించారు.

 అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలోని సోనిట్ పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో నాలుగు చోట్ల బోడో తీవ్రవాదులు చేసిన దాడుల్లో మృతుల సంఖ్య 68 మందికి చేరింది. తీవ్రవాదులు దాడికి ఆగ్రహించిన అదివాసీలు, స్దానికులు కొన్ని చోట్ల ఎదురు దాడులకు దిగుతున్నారు.

 అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో తీవ్రవాదుల దాడి

దీంతో బోడో తీవ్రవాదుల ఇళ్లకు నిప్పంటించారు. వారికి వ్యతిరేకంగా ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు జరిపిన దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది.

 అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో తీవ్రవాదుల దాడి

దాడి నేపథ్యంలో అస్సాం పోలీసులు బోడోలపై ఉక్కుపాదం మోపగా, రాష్ట్ర బలగాలకు మరింత దన్నుగా నిలిచేందుకు కేంద్రం అదనపు బలగాలను అస్సాంకు పంపింది. 5 వేల మంది పారామిలిటరీ బలగాలను అసోంకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

 అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో తీవ్రవాదుల దాడి

హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ ఈ హింసాత్మక దాడులను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడులకు దిగిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులను గట్టిగా తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.

అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో తీవ్రవాదుల దాడి

అస్సాంలో బోడో తీవ్రవాదుల మారణహోమంపై నిరిసనలు వెల్లువెత్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇది ఇలా ఉంటే తీవ్రవాదులను అణిచివేయాలంటూ అస్సాం వాసులు ఢిల్లీలోని అస్సాం భవన్ ఎదుట ఆందోళనకు దిగారు.

హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ ఈ హింసాత్మక దాడులను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడులకు దిగిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులను గట్టిగా తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.

అస్సాంలో బోడో తీవ్రవాదుల మారణహోమంపై నిరిసనలు వెల్లువెత్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇది ఇలా ఉంటే తీవ్రవాదులను అణిచివేయాలంటూ అస్సాం వాసులు ఢిల్లీలోని అస్సాం భవన్ ఎదుట ఆందోళనకు దిగారు.


అస్సాం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్రమోడీ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి రూ. 86 లక్షలు విడుదల చేసినట్లు పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది.

English summary
Violence escalated in Assam on Wednesday as the toll in the carnage by NDFB(S) militants rose to 68, mostly women and children, with advivasis retaliating by torching houses and attacking a police station during protests that left 3 persons dead allegedly in police firing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X