వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండచరియలు పడి 20మంది మృతి: వరదల్లోనే రైలు

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌: భారీ వర్షాలు పశ్చిమబెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సుమారు 20 మంది మృతిచెందారు. చాండెల్‌ జిల్లా జౌమోల్‌ గ్రామంలో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.

కాగా, భారత, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న దుర్ఘటన స్థలానికి పోలీసుల్ని పంపినట్లు ఎస్పీ హీరోజిత్‌సింగ్‌ తెలిపారు. క్షతగాత్రులను కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడటం, వరదలు చాలా ఎక్కువగా ఉండటంతో రక్షణ బృందాలు అక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంఫాల్ లో దిగువ ప్రాంతాల్లో ఉండే వారు ఇళ్లు కోల్పోయి శివారు ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉన్నారు.

పశ్చిమబెంగాల్ లో వరద భీభత్సంతో తాజాగా 12 జిల్లాల్లో 1.19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లోని 4.79 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు వెల్లడించారు.

మణిపూర్‌లో వరద బీభత్సం

మణిపూర్‌లో వరద బీభత్సం

భారీ వర్షాలు పశ్చిమబెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి.

వరద బీభత్సం

వరద బీభత్సం

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సుమారు 20 మంది మృతిచెందారు. చాండెల్‌ జిల్లా జౌమోల్‌ గ్రామంలో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.

నీళ్లలోనే రైలు

నీళ్లలోనే రైలు

పశ్చిమబెంగాల్ లో వరద భీభత్సంతో తాజాగా 12 జిల్లాల్లో 1.19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

ఆలయంలో వరదనీరు

ఆలయంలో వరదనీరు

ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లోని 4.79 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయంలో..

విమానాశ్రయంలో..

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా విమానాశ్రయంలోకి చేరుకున్న వరదనీరు.

English summary
At least 20 people were killed and several houses swept away as a landslide, caused by heavy rain, devastated a village in Manipur's Chandel district bordering Myanmar on Saturday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X