వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: 41మంది భారతీయులు మృతి, 7,276కు చేరిన మృతులు

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటివరకు 41మంది భారతీయులు మృతి చెందారు. నేపాల్ విపత్తులో మొత్తం 57 మంది విదేశీయులు మృతి చెందగా.. వీరిలో 41 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరో 10మంది గాయాలయినట్టు తెలిపారు.

ఈ విపత్తులో ఇప్పటివరకు 7,276 మంది మృతి చెందారు. మరో 14,267 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నేపాల్ ఆర్థిక మంత్రి రాంశరణ్‌ మహత్ వెల్లడించారు.

కాగా, గోర్ఖా జిల్లాలోని మారుమూల గ్రామంలో భూకంప శిథిలాల్లో చిక్కుకున్న 22మంది బుద్ధ సన్యాసులను భారత వైమానిక దళం కాపాడింది. భారత యువ పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పాయిని కాపాడిన నేపాల్ సహాయక బృందాలు ఖాట్మాండ్‌కు తరలించాయి.

At least 41 Indians killed in Nepal due to the earthquake, says police

భూకంప బాధితుల కోసం ప్రధాని ప్రార్థనలు

సోమవారం ఢిల్లీలో జరగనున్న బుద్ధపూర్ణిమ దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. బుద్ధుని జన్మస్థలమైన నేపాల్, భూకంప బాధితుల కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ప్రపంచమంతటి నుంచి పలువురు బౌద్ధ సన్యాసులు, మేధావులు, దౌత్యవేత్తలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇక్కడి బుద్ధుడి స్థూపాన్ని ఆయన జీవితం, బోధనలకు అంకితమిచ్చే కేంద్రంగా మార్చే అంశంపై చర్చించనున్నారు. సోమవారం జరగనున్న అసామాన్యమైన ఉత్సవాల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు ప్రకటించారు. బుద్ధునికి జ్ఞానోదయమైంది, బౌద్ధ మతం పుట్టింది మన దేశంలోనేనని పేర్కొన్నారు.

English summary
At least 41 Indians are among 57 foreigners killed in Nepal in the powerful earthquake that left a trail of devastation and suffering, flattening buildings and uprooting electric poles and trees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X