వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కూల్చివేత: అద్వానీకి, మరో 19 మంది సుప్రీం నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు మంగళవారంనాడు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి, మరో 19 మందికి నోటీసులు జారీ చేసింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అలహాబాద్ హైకోర్టు అద్వానీతో పాటు మిగతావారిని క్రిమినల్ కుట్ర అభియోగాల నుంచి విముక్తం చేస్తూ 2010లో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును హజీ మెహబూబ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్‌పై స్పందించడానికి సుప్రీంకోర్టు సిబిఐకి, ఇతరులకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు మసీదును కూల్చివేయడం జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.

Babri Masjid demolition case: SC issues notice to BJP leader L K Advani, 19 others

బాబ్రీ కట్టడం కూల్చివేత కేసుకు సంబంధించి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ఇతర నేతలు జాతీయ నేరానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు అలాంటి భాష ఉపయోగించవద్దని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది.

English summary
The Supreme Court on Tuesday issued notice to BJP leader L K Advani and 19 others on a petition filed by Haji Mehboob, challenging 2010 Allahabad high court verdict acquitting them of criminal conspiracy in the demolition of the Babri Masjid on December 6, 1992.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X