వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ బాంబులు సీజ్: మంగళూరులో అలర్ట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అరాచకాలు స్పృష్టించడానికి పెట్రోల్ బాంబులు తయారు చేశారు. విషయం పసిగట్టిన మంగళూరు బజ్పే పోలీసులు బాంబులు స్వాదీనం చేసుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు నగరంలోని బజ్పే విమానాశ్రయం సమీపంలోని టెలిఫోన్ ఎక్సైంజ్ కార్యాలయం దగ్గర బాంబులు సీజ్ చేశామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ చెప్పారు.

మంగళూరు నగర శివార్లలోని గంజిమఠ ప్రాంతంలోని ఇంటిలో పెట్రోల్ బాంబులు నిల్వ చేశారని ఒక అజ్ఞాత వ్యక్తి బజ్పే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఇంటి మీద దాడి చేశారు.

Bajpe Police personnel then visited the spot and sized the petrol bombs.

ఇంటిలో నిల్వ చేసిన 8 పెట్రోల్ బాంబులు, మూడు తల్వార్ లు స్వాదీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురుగన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెట్రోల్ బాంబులు ఎవరు నిల్వ చేశారు అని ఆరా తీస్తున్నారు.

దక్షిణ కన్నడ జిల్లాలో రెండు వర్గాల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పర్యటించే సమయంలో మంగళూరులో గొడవలు స్పృష్టించాలని పథకం వేసి ఉంటారని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Bajpe Police personnel then visited the spot and sized the petrol bombs.

ముందు జాగ్రత చర్యగా బజ్పే విమానాశ్రయం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బాంబులు ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్న వారు ఎవరనే విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bajpe police seized eight petrol bombs from near the telephone exchange building in Ganjimath on Monday March 30 night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X