వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ చేరుకున్న ఒబామా, మోడీ ఆత్మీయ అలింగనం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీ సమేతంగా అనుకున్న సమయం కంటే 20 నిమిషాలు ముందు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి ముందుగానే చేరుకున్నారు. ఒబామాకు ఢిల్లీలో సాదర స్వాగతం లభించింది.

స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్ద నిలిపి, దానికి సమీపంలోనే స్వాగత కార్యక్రమాలను పూర్తి చేశారు.

ముందుగా ఒబమాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత ఆయన్ని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోడీతో చేతులు కలిపారు. అనంతరం మోడీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.

తర్వాత ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. ఒబామా రాకతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అంతే కాకుండా ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే.

ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్న ఒబామా:

పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు.స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ విమానం వద్దకు వచ్చి మరీ ఒబామా దంపతులకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

 ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీ సమేతంగా అనుకున్న సమయం కంటే 20 నిమిషాలు ముందు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి ముందుగానే చేరుకున్నారు. ఒబామాకు ఢిల్లీలో సాదర స్వాగతం లభించింది.

 ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్ద నిలిపి, దానికి సమీపంలోనే స్వాగత కార్యక్రమాలను పూర్తి చేశారు.

 ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

ముందుగా ఒబమాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత ఆయన్ని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోడీతో చేతులు కలిపారు. అనంతరం మోడీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.

 ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు, మోడీ ఆత్మీయ అలింగనం

తర్వాత ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. ఒబామా రాకతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అంతే కాకుండా ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే.

విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులు కూడా ఒబామాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. కాగా, ఒబామా దంపతులు బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్ ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

English summary
President Barack Obama and the First Lady Michelle Obama arrived in New Delhi on Sunday morning ahead of schedule to start a three-day visit to the country to showcase what his administration sees as a deepening relationship between the United States and India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X