వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి మైనింగ్ కింగ్ గాలి విచారణ ? బెంగళూరు సిట్ కార్యాలయంలో !

సీబీఐ అనుబంధ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారించి పలు కీలకమైన వివరాలు సేకరించారని సమాచారం. బెంగళూరులోని సిట్ కార్యాలయంలో మంగళవారం గాలి జనార్దన్ రెడ్డిని .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలిజనార్దన్ రెడ్డిని అధికారులు మరోసారి విచారించారని సమాచారం. గనుల అక్రమ తవ్వకం, ఇనుప ఖనిజం తరలింపు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డిని మంగళవారం అధికారులు విచారించారని సమాచారం.

సీబీఐ అనుబంధ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారించి పలు కీలకమైన వివరాలు సేకరించారని సమాచారం. బెంగళూరులోని సిట్ కార్యాలయంలో మంగళవారం గాలి జనార్దన్ రెడ్డిని విచారించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Former Karnataka Minister, Mining baron Gali Janardhar Reddy illegal mining case.

గాలి జనార్దన్ రెడ్డిని సిట్ వర్గాలు మరో సారి విచారించిందన్న విషయాన్ని ఆయన సోదరుడు, బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ విషయంపై సీబీఐ అధికారులు సైతం ఇప్పటి వరకు స్పందించలేదు.

అక్రమ గనుల కేసులో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డిని 2015 నవంబర్ 20వ తేదిన సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. తరువాత ఆయన జామీనుపై బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ గాలి జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారని వెలుగుచూడటంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురౌతున్నారు.

English summary
Former Karnataka Minister, Mining baron Gali Janardhar Reddy illegal mining case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X