బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందంగా ఉన్నాడని మర్మాంగం కోసి, హిజ్రాను చేసి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అందంగా ఉన్నాడని, అమాయకుడని గుర్తించిన హిజ్రాలు దారుణంగా ప్రవర్తించారు. యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి అతని మర్మాంగాన్ని పదునైన కత్తితో కోసేశారు. తరువాత నాటు వైద్యం చేయించడంతో అతని పరిస్థితి విషమంగా మారింది.

బెంగళూరు నగరంలోని కాక్స్ టౌన్ లో ఓ యువకుడు (18) నివాసం ఉంటున్నాడు. ఇతను చూడటానికి చాల అందంగా ఉంటాడు. అంతే కాకుండా అమాయకుడు. ఆనంది అనే హిజ్రా ఆయువకుడిని లింగమార్పిడి చేసుకుని తమ గ్రూప్ లో చేరాలని ఒత్తిడి చేసింది.

అందుకు ఆ యువకుడు అంగీకరించలేదు. అంతే ఆనంది రెచ్చిపోయింది. నేను చెప్పిన మాట వినవా అంటూ తన గ్రూప్ తో కలిసి రెండు వారాల క్రితం ఆయువకుడిని కిడ్నాప్ చేసింది. తరువాత పదునైన కత్తి తీసుకుని అతని మర్మాంగాన్ని కోసివేశారు.

Bengaluru: Boy’s castration, team formed to eatch culprits

నాటు వైద్యం చేయించి తన గ్రూప్ లో చేర్చుకున్నారు. ఇటీవల మూత్ర విసర్జన సాధ్యం కాక అతను నారకయాతనకు గురైనాడు. విషయం తెలుసుకున్న కొందరు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి లింగమార్పిడి పనులు చేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరిక్ తెలిపారు.

కేసు నమోదు అయిన వెంటనే హిజ్రా ఆనంది మాయం అయ్యింది. ఈలాంటి దారుణాలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని హిజ్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయువకుడిని అన్ని విధాల తాము ఆదుకుంటామని హిజ్రా సంఘాలు తెలిపాయి.

బలవంతంగా లింగమార్పిడి చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. యువకుడ్ని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకు వెళ్లారు ? మర్మాంగం కోసింది ఎవరు? నాటు వైద్యం చేసింది ఎవరు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru police said the boy did not reveal the genital mutilation when he was rescued, but later got admitted to the hospital following health complication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X