బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శుభవార్త:ఇక ఇంటికే డీజీల్, బెంగుళూరు సంస్థ రికార్డ్

ఇక డీజీల్ కోసం పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటికే డీజీల్ రానుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఇక డీజీల్ కోసం పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటికే డీజీల్ రానుంది. అయితే బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఇంటికే నేరుగా డీజీల్ ను తరలించే సంస్థగా రికార్డుల్లోకి ఎక్కింది.

ఐఐటీ-ధన్ బాద్ పూర్వ విద్యార్థి ఆషీష్ కుమార్ గుప్తా మై పెట్రోల్ పంపు పేరుతో ఈ స్టార్టప్ ను ఏర్పాటుచేశారు. ఈ స్టార్టప్ సహయంతో డీజీల్ ను నేరుగా ఇంటివద్ద నుండి డెలివరీ చేస్తున్నారు. ఇంటి వద్ద నుండి డీజీల్ ను డెలీవరి చేస్తున్న సంస్థగా రికార్డులకెక్కింది.

ఈ నెల 15వ, తేది నుండి ఈ సంస్థ తన సేవలను ప్రారంభించింది.950 లీటర్ల సామర్థ్యంతో మూడు డెలివరీ వాహనాలను ఈ సంస్థ ఏర్పాటుచేసింది. 5 వేలకు పైగా లీటర్ల డీజీల్ ను ఈ సంస్థ డెలీవరి చేస్తోంది. ఫిక్స్ డ్ డెలీవరి ఛార్జీలతో ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ధరలకే డీజీల్ ను వారు డెలీవరీ చేస్తున్నట్టు టైమ్ ఆఫ్ ఇండియా రిపోర్టు నివేదిక తెలిపింది.

Bengaluru firm 1st in India to deliver diesel at home

100 లీటర్ల వరకు డీజీల్ ను ఒక్కసారి డెలీవరీ చేస్తే 99 రూపాయాల చార్జీలను తీసుకొంటోంది.అంటే లీటర్ ఒక రూపాయి అదనంగా డెలివరీ ఛార్జీలను ఈ సంస్థ వేస్తోంది. యాప్ డౌన్ లోడ్ ద్వారా లేదా ఆన్ లైన్ లో , ఫోన్ కాల్ ద్వారా డీజీల్ ను వావానదారులు ఆర్డర్ చేసుకోవచ్చు.

గత ఏప్రిల్ లోనే పెట్రోల్, డీజీల్ ను ఇంటివద్దనే డెలీవరి చేసే అవకాశం ఉందని పెట్రోలియం మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ముందస్తు బుకింగ్ లతో డోర్ డెలీవరి ఆఫ్షన్లను పరిశీలిస్తున్నామని చెప్పింది.

దీంతో బంకుల వద్ద క్యూ లైన్లను తగ్గించుకోవచ్చని పేర్కొంది. కీలక సమయాల్లో అయితే బంకుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. దేశంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల డీజీల్, 23.8 మిలియన్ టన్నుల పెట్రోల్ ను వినియోగం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ వినియోగం అధికంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 59,595 పెట్రోల్ పంపులున్నాయి.

English summary
Bengaluru has become the country's first city where one can have fuel delivered at one's doorstep, just like milk and newspapers, only weeks after oil ministry announced that the Centre was thinking of rolling out such a system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X