హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివరాయ్ ఫ్యామిలీ ఉదారత: హైదరాబాద్‌కు ఇలా గుండె రవాణా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి సజీవంగా ఉన్నగుండెను హైదరాబద్ కు తరలించారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్న హైదరాబాద్ గ్గోబల్ ఆసుపత్రి వైద్యులు విక్టోరియా ఆసుపత్రి చేరుకున్నారు. తరువాత విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నశివరాయ్ భాగి అలియాస్ సాయి (30) కుటుంబ సభ్యులతో సంప్రదించారు. విక్టోరియాఆసుపత్రి వైద్యుల సహకారంతో శివరాయ్ భాగికి ప్రత్యేక చికిత్స అందించి గుండెను తీసుకున్నారు.

తరువాత గుండెను ప్రత్యేక బాక్స్ లో భద్రపరిచారు. ఉదయం 11.40 గంటల సమయంలో బెంగళూరు పోలీసులు విక్టోరియా ఆసుపత్రి నుండి హెచ్ఏఎల్ విమానాశ్రయం వరకు జీరో ట్రాఫిక్ చేశారు. వైద్యులు గుండెను తీసుకుని అప్పటికే సిద్దం చేసిన ప్రత్యేక ఆంబులెన్స్ లో హెచ్ఏఎల్ విమానాశ్రయం దగ్గరకు బయలుదేరారు. బెంగళూరు పోలీసు అధికారులు ఆంబులెన్స్ ముందు, వెనుక ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ఏలాంటి అటంకం కలగకుండ విమానాశ్రం చేరుకున్నారు. అప్పటికే సిద్దంగా ఉన్న విమానంలో గుండెను హైదరాబాద్ తీసుకు వెళ్లారు.

Bengaluru Victoria Hospital doctors to take live heart to Hyderabad for implantation.

శివరాయ్ భాగి మహారాష్ర్టలోని సోలాపూర్ కు చెందిన వాడు. ఇతను బెంగళూరు చేరుకుని ఎలక్ట్రానిక్ సిటిలోని జపాన్ మెటల్ సిస్టమ్స్ అనే కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటివల శివరాయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విక్టోరియా ఆసుపత్రికి తరలించగా అతను కోమాలోకి వెళ్లి పోయాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ వైద్యులు బెంగళూరు చేరుకుని శివరాయ్ కుటుంబ సభ్యులతో చర్చించారు.

శివరాయ్ ప్రాణాలు పోయే ముందు మరొకరికి జన్మనివ్వడానికి మీరు గుండె దానం చేసి సహకరించాలని మనవి చేశారు. శివరాయ్ కుటుంబ సభ్యులు చర్చించుకుని తరువాత వైద్యులను సంప్రదించారు. శివరాయ్ గుండెను దానం చెయ్యడానికి వారు అంగీకరించారు. శనివారం శివరాయ్ గుండెను దానం చేసిన తరువాత అతని కళ్లు, కిడ్నీలను వేరే వారికి దానం చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. గుండె మార్పిడి వేళ ఎయిర్ పోర్టుకు వెలుతున్న సయంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండ తగిన జాగ్రతలు తీసుకున్న పోలీసులను ముఖ్యమంత్రి సిద్దరామయ్య అభినందించారు.

English summary
Bengaluru Victoria Hospital doctors took and transported Shiv Rai's live heart to Hyderabad for implantation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X