వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాలకు వేతనాల పెంపు?

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలో పనిచేసే వారికి ఈ ఏడాది అంతా మంచే జరగనుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా వేతనాలు పెరిగే అవకాశాలున్నాయని టీమ్ -లీజ్ జాబ్స్ శాలరీస్ ప్రీమియర్ -2017 సంస్థ తెలిప

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలో పనిచేసే వారికి ఈ ఏడాది అంతా మంచే జరగనుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా వేతనాలు పెరిగే అవకాశాలున్నాయని టీమ్ -లీజ్ జాబ్స్ శాలరీస్ ప్రీమియర్ -2017 సంస్థ తెలిపింది.

గత నాలుగేళ్ళుగా వేతనాల ఇంక్రిమెంట్లలో టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ రంగం తర్వాత ఈ ఏడాది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి ఎక్కువ వేతన ఇంక్రిమెంట్ ఉండబోతున్నట్టు పేర్కొంది. ఎన్నడూ లేనంతంగా సగటున 17.2 శాతం వేతన ఇంక్రిమెంట్లు ఉంటాయని ఆ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది.

BFSI sector edges out information technology to become top paymaster

విద్యా, ఈ కామర్స్ రంగాల్లో వందకు పైగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందని వెల్లడించింది. అదే విధంగా ఇళ్ళ నిర్మాణం, రియల్ ఏస్టేట్, ఆటోమొబైల్ , పారిశ్రామిక తయారీ దాని అనుబంధ పరిశ్రమల్లో ఇంక్రిమెంట్లు తగ్గిపోనున్నాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ రంగాలను భారీగా దెబ్బకొట్టింది. ఇతర రంగాలు ఎప్ఎమ్ సీజీ , రిటైల్ ర్యాలీ నిర్వహిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. తక్కువ సప్లై , ఎక్కువ డిమాండ్ కారణంగా బ్లూ కలర్ జాబ్స్ కు కొన్నేళ్ళుగా డిమాండ్ భారీగానే ఉంది.

శారీరక శక్తి , వ్యాయామం, బేసిక్ రీడింగ్, రాత , మౌఖిక కమ్యూనికేష్, వ్యక్తిగత నేర్పు వంటి స్కిల్స్ ఉన్నవారికే డిమాండ్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.

శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాల మధ్య ఏ మేరకు తేడా ఉంటుందనేది కూడ వెల్లడించింది. ఆరు నగరాల్లో ఏడు రంగాలపై జరిపిన సర్వేలో తాత్కాలిక , శాశ్వత ఉద్యోగాల మధ్య తేడా స్వల్పంగానే ఉన్నట్టు తెల్పింది.

ఈ విషయంలో చంఢీఘర్ (0.92 శాతం-2.8 శాతం),కోల్ కత్తా(1% -3.14%), అహ్మాదాబాద్ (1.08% -2.73%) టాప్ లో ఉన్నట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. ఐటీ, తయారీ , టెలికమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐలు టాప్ లో ఉన్నాయని ఆ సంస్థ తన రిపోర్ట్ లో వెల్లడించింది.

English summary
The banking, financial services and insurance sector will pay out fairly large increments this time around in sharp contrast to the last couple of years when hikes were affected, the Team-Lease Jobs and Salaries Primer 2017 has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X