వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీఐపీ లేడీ నగ్నఫోటోలు: రూ. 2 కోట్లు, పోర్న్ లో

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాకు చెందిన పెద్దింటి మహిళ నగ్న ఫోటోలు పోర్న్ గ్రాఫిక్ సైట్లలో పెట్టి మీపరువు తీస్తామని, అలా చెయ్యరాదంటే రూ. రెండు కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే తాము వరసపెట్టి నీ ఫోటోలు పోర్న్ సైట్లలో పెడుతామని 30 ఏళ్ల మహిళను వారు ఈ-మెయిల్ ద్వారా బెదిరించడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దింటి మహిళను బెదిరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 Bhopal: Pay Rs. 2 crore in Bitcoins or find your pics on porn sites

ఈ విషయంపై జబల్ పూర్ జిల్లా ఎస్పీ ఆశిష్ మాట్లాడుతూ నిందితులు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, భయాందోళనలకు గురైనారని అన్నారు.

ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, అంతే కాకుండా వరసపెట్టి పోర్న్ సైట్లలో పెడుతామని, అలా జరగరాదంటే బిట్ కాయిన్ల రూపంలో రూ. రెండు కోట్లు చెల్లించాలని వారు బెదిరించారని ఎస్పీ ఆశిష్ చెప్పారు.

రూ. రెండు కోట్లు చెల్లించడానికి వారు ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కేసులు దర్యాప్తు చెయ్యడం చాలకష్టం అని ఆయన అన్నారు. అయితే ఆమెకు ఫిలిపెన్స్ నుంచి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని విచారణలో వెలుగు చూసిందని ఎస్పీ ఆశిష్ చెప్పారు.

నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు ఉపయోగించడం వలన వాళ్లు సెర్వర్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం చాల కష్టం అని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే శ్రీమంతులైన ఆ పెద్దింటి మహిళ కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడు ఏమీ జరుగుతుందో ? ఎలాంటి వార్త వినవలసి వస్తూందో అంటూ హడలిపోతున్నారు.

English summary
The complainant is being blackmailed by miscreants who are threatening to upload her pictures on obscene sites if she fails to meet their demand. We are trying to trace the culprit," said Ashish, superintendent of police, Jabalpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X