వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ సీఎం డేరింగ్ నిర్ణయం: వీఐపీ అనే పదానికి చమరగీతం !

ప్రభుత్వ వాహనాలపై ఎర్రబుగ్గల ఉంచే సాంప్రధాయానికి, రెండేళ్లపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశీ ప్రయాణాలు చెయ్యరాదని, ఇక ముందు ప్రభుత్వ ఖర్చుతో విందులు, వినోదాలు నిర్వహించరాదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలపై ఎర్రబుగ్గల ఉంచే సాంప్రధాయానికి చెక్ పెట్టారు. పంజాబ్ లో వీవీఐపీ సాంప్రధాయానికి చమరగీతం పెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా రెండేళ్లపాటు పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశీ ప్రయాణాలకు చెక్ పెట్టారు. ఇక ముందు ప్రభుత్వ ఖర్చుతో విందులు, వినోదాలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాజానాపై దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

Bid to end VIP culture: No red beacons in Punjab

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సింగ్ తన తొలి క్యాబినేట్ సమావేశంలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముందు ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్, పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, అగ్నిమాక వాహనాలకు మాత్రమే ఎర్రబుగ్గలు దర్శనమిస్తాయి.

పంజాబ్ లో ఇక ముందు వీఐపీ సంప్రాధాయానికి పూర్తిగా చమరగీతం పాడేందుకే ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఎర్రబుగ్గల వినియోగాన్ని తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇతర రంగుల బుగ్గల వినియోగాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు.

English summary
The Amarinder Singh government put a ban on use of beacons on government vehicles, foreign travel of ministers for two years and organising of banquets on state expense, in a bid to end VIP culture in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X