వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:ఇంట్లో, పర్యటనలకు వెళ్ళినప్పుడు మద్యం తాగితే....ఇలా

పనిచేసే చోటే కాదు, ఇంట్లో బయట రాష్ట్రాల్లో పర్యటించే సమయాల్లో మద్యం సేవించరాదని చట్ట సవరణ చేసేందుకు బీహర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం బుదవారం నాడు తీర్మాణం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా:మద్య నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకుగాను బీహర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కఠిన చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం వెలుపల కూడ మద్యాన్ని తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

బీహర్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేస్తామని నితీష్ కుమార్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ హమీని అమలుచేస్తున్నారు.అయితే సంపూర్ణ మధ్య నిషేధం అమలు కోసం నితీష్ మూడు మాసాల క్రితం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహలు తీసుకొన్నారు.

Bihar Babus Cannot Drink Even Outside State, Nitish Govt Decides

సంపూర్ణ మధ్యనిషేధం అమలు విషయమై నితీష్ కుమార్ తీరుపై విపక్షాలు ఆరోపణలు కూడ గుప్పించాయి.వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నితీష్ కుమార్ సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు పటిష్టంగానే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకొంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలోనే కాదు బయట కూడ మద్యం తాగకుండా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 1976 లో బీహర్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని మార్చాలని నిర్ణయం తీసుకొన్నారు.

బీహర్ జ్యూడిషియల్ అధికారుల ప్రవర్తన నియమావళిలో సవరణ చేయాలని కేబినేట్ సమావేశంలో తీర్మాణం చేశారు. ఈ మేరకు బుదవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది ఆ రాష్ట్ర మంత్రివర్గం.

ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి ప్రకారంగా పనిచేసే చోట ఉన్న ప్రదేశంలో ఉద్యోగులు మద్యం సేవించరాదు.అయితే దీన్ని సవరించనున్నారు. ఉద్యోగులు పనిచేసే చోటే కాదు, ఇంట్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అధికారిక పర్యటకు వెళ్ళిన సమయాల్లో కూడ మద్యాన్ని సేవించరాదని చట్టాన్ని సవరించనున్నారు.

English summary
The Bihar cabinet has decided to bring an amendment in the service rule for government employees including those from judicial services forbidding them from consuming liquor even outside the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X