వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.8వేల కోట్లు ఒబామాను అడిగేందుకు మెయిల్ చేయబోయి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను డబ్బులు డిమాండ్ చేయబోయి ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. భారత దేశంలో పర్యటిస్తున్న ఒబామాకు అతను మెయిల్ చేద్దామనుకున్నాడు. ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఉర్దూలో రెండు పేజీల లేఖ రాశాడు.

ఇంతలో ఇంటర్నెట్ సెంటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇది బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఇనాం రజా అనే 49 ఏళ్ల వ్యక్తి నేషనల్ రిలీఫ్ ఫండ్ కోసం బరాక్ ఒబామాను 130 కోట్ల డాలర్లు (రూ.ఎనిమిదివేల కోట్లకు పైగా) ఇవ్వాలని కోరుతూ మెయిల్ చేద్దామనుకున్నాడు.

Bihar Man Arrested for Trying to Write to Barack Obama

రజా మానసిక సమస్యలకు మందులు వాడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా అతనిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్పారు. కాగా, పోలీసులు అతని గత చరిత్రను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహాత్ముడికి నివాళులర్పించిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీ సమాధి దగ్గర పుష్పగుచ్ఛం పెట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో మహాత్మా గాంధీ ప్రపంచానికే నేత అని ఒబామా పేర్కొన్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌ పరిసరాల్లో మొక్కను నాటారు.

English summary
Ahead of the three-day visit to India by the US President, police today took a 49-year-old man into custody from a cyber cafe in temple town of Bodh Gaya for allegedly trying to send an e-mail to Barack Obama seeking 130 crore dollars as fund for national relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X