వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: మహిళపై గ్యాంగ్‌రేప్, ముక్కు కోసేశారు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దుర్మార్గులు, అంతటితో ఆగకుండా ఆమె ముక్కును కోసేసి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన బసంత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖ్వస్పూర్ గ్రామంలోచోటు చేసుకుంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Bihar shocker: Two men chop off woman’s nose after rape; on the run

స్థానికుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాధిత మహిళ కుటుంబసభ్యులందరూ బయటకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దుండగులు, ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసేసి పరారయ్యారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
In a shocking case of crime against women, criminals on Thursday first raped a woman and then chopped off her nose in Siwan district of Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X