వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లే నమ్మలేకపోయారు.. బిలాస్‌పూర్‌లో ఉష్ణోగ్రతలు ఎంతకు పెరిగాయంటే?

రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్‌పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో అత్యధికంగా 49.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం నాడు నమోదైన ఈ ఉష్ణోగ్రతను చూసి అధికారులే షాక్ తిన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఉష్ణోగ్రత తప్పుగా నమోదైందా? లేక నిజంగానే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయా? అన్న సందేహం కలిగింది.

రాష్ట్రంలో ఇంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని రాయ్‌పూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ప్రకాశ్ ఖరే తెలిపారు. అదే సోమవారం నాడు రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయ్ పూర్ నుంచి బిలాస్‌పూర్ 120కి.మీ దూరంలో ఉంటుంది.

Bilaspur Records Highest 49.3 Degree Celsius Temperature In Chhattisgarh

బిలాస్‌పూర్‌లో ఇంతకుముందు మే23,2013లో అత్యధికంగా 47.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుని 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. తొలుత సాంకేతిక లోపాలేమైనా తలెత్తయా? అన్న అనుమానం కలిగినప్పటికీ.. నైరుతి నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Heat wave conditions intensified in isolated parts of Chhattisgarh, with Bilaspur city recording the highest ever temperature in the state at 49.3 degrees Celsius on Monday, prompting a detailed investigation by authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X