వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చీటింగ్: రాహుల్, పడబోయిన మహిళని పట్టుకున్న యువనేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తేవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులను చీటింగ్ చేస్తోందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. రాహుల్‌ నేతృత్వంలో కిసాన్‌ ర్యాలీ ఆదివారం ఉదయం రాంలీలా మైదాన్‌లో ప్రారంభమైంది. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచి వేలాదిగా రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి వచ్చారు. భూసేకరణ ఆర్దినెన్స్‌, భూసేకరణ సవరణల బిల్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని రాహుల్ చెప్పారు. రాంలీలా మైదాన్‌ వేదికగా రైతులను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. కేంద్రం రైతులు, కూలీలను మర్చిపోయిందన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

BJP cheating farmers by passing land ordinance: Rahul Gandhi

కేంద్రం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోందన్నారు. ఆహార భద్రత చట్టం సహా సామాన్యులకు తాము ఎంతో చేశామన్నారు. రైతులకు భారం తగ్గించేందుకు రూ.70వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా తాము ఆదుకుంటామన్నారు.

రైతుల శ్రేయస్సు కోసమే గోదుముల మద్దతు ధర పెంచామన్నారు. దేశంలో రైతులు, కూలీలు భయపడుతున్నారన్నారు. రైతులకు నష్టం చేకూరని భూసేకరణ చట్టాన్ని తెచ్చామని, తాము తెచ్చిన బిల్లుకు సవరణ చేయాలని చూస్తున్నారన్నారు. రైతులలకు నష్టం కలగని భూసేకరణ బిల్లు తెచ్చేందుకు రెండేళ్ల సమయం పట్టిందన్నారు. 50 ఏళ్లుగా దేశంలో పోగైన చెత్తను శుభ్రం చేస్తానని ప్రధాని చెప్పడం విచారకరమన్నారు.

అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. రైతులు ప్రధాని మోడీ మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. రైతు సమస్యలు మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తీరు గాయం పైన కారం చల్లినట్లుగా ఉందన్నారు.

మహిళకు రాహుల్ గాంధీ

రాంలీలా మైదాన్‌లో జరుగుతున్న కిసాన్ ర్యాలీ వేదిక పైన ఓ మహిళ తూలి పడిపోబోగా.. రాహుల్ గాంధీ పట్టుకున్నారు. రాహుల్ గాంధీ సహా పలువురిని నేతలు సత్కరించేందుకు వేదిక పైకి వచ్చారు. ఆ సమయంలో ఓ మహిళా నాయకురాలు పడబోయారు. వెంటనే స్పందించిన రాహుల్.. ఆమెను పట్టుకొని నిలబెట్టారు.

English summary
Congress today (Sunday, April 19) will hold a mega rally for farmers of the country. Congress Vice President Rahul Gandhi will be present at the venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X