వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే భార్యకు కానుకగా 5.5కోట్ల కారు: రోడ్డుపై బీభత్సం(వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: భార్య పుట్టిన రోజుకు భర్త కానుక ఇవ్వడం సాధారణమే. సామాన్య వ్యక్తి అయితే ఏదో ఒక చిన్నపాటి కానుక ఇచ్చి సంతోష పెడతాడు. అదే ఎమ్మెల్యే అయితే ఆ కానుక ఖరీదైనదే అయి ఉంటుంది. ఇదే దారిలో మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ భారీ కానుకను అందించాడు.

అదే రూ.5.5కోట్ల విలువ చేసే విలాసవంతమైన లంబోర్గిని కారు. అంతేగాక, తన భార్య ఫొటో పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సంబరపడ్డారు. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ కారుతో ఆయన సతీమణి రోడ్డుపైకి వచ్చి చిన్నపాటి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ కారు విషయం ఇప్పుడు పెద్ద వార్తగా అయి కూర్చుంది.

అసలు విషయానికొస్తే.. ఆఎమ్మెల్యే భార్య లంబోర్గిని కారు డ్రైవ్ చేసుకుంటూ ఓ ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత కారును అక్కడే ఆపేసింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు ఎవరా? అని విచారిస్తే ఎమ్మెల్యే భార్యగా తేలింది. ఎంతైనా ఎమ్మెల్యే గారి భార్య కదా.. అని పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేశారు. దగ్గరుండి సాగనంపారు.

కాగా, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన కొందరు నెట్‌లో పెట్టడంతో వైరల్‌గా మారిన హల్‌చల్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఈ ప్రమాదం గురించి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం మరీ విడ్డూరంగా ఉంది. ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పడం పోయి... తన భార్యకు 18సంవత్సరాలకు పైగా కారు నడపడంలో అనుభవం ఉందని చెప్పారు.

ఆడీ, ఇతర బ్రాండెడ్ కార్లను ఎన్నో నడిపిందని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని బదులిచ్చారు. అయినా కేవలం ఆటోను జస్ట్ టచ్ చేసిందని... ప్రమాదమేమి లేదని చెప్పుకొచ్చారు ఆ ఎమ్మెల్యే. కాగా, ఎమ్మెల్యే సమాధానంపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎవరికైనా ఏమైనా జరిగివుంటే ఏం చేసేవారని ప్రశ్నిస్తున్నారు.

English summary
Wife of a BJP MLA rammed her newly-gifted saffron Lamborghini into an auto rickshaw within seconds of taking her car out for the first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X