వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో విజయం: బీజేపీ బహుళ అంచెల వ్యూహం

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో బిజయం సాధించడమే కమలనాథులకు అసలుసిసలు ప్రధాన సవాల్‌గా పరిణమించనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కోల్‌కతా‌: దేశంలోని 29 రాష్ట్రాలకు 16 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవశం చేసుకున్న బీజేపీకి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పట్టు సాధించే అంశంపై ఆందోళనేమీ లేదు. ఇప్పటికే 60 శాతానికి పైగా జనాభా గల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది.

గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని కొనసాగించడం సమస్యగా పరిగణించడం లేదు. కానీ పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో బిజయం సాధించడమే కమలనాథులకు అసలుసిసలు ప్రధాన సవాల్‌గా పరిణమించనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికారం సంపాదించడంపై ద్రుష్టి సారించిన బీజేపీ.. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల మధ్య అసోం రాష్ట్రంలో అధికారం సంపాదించి పట్టు సాధించింది.. అంతే కాదు బలం సంపాదించుకున్నది. కేరళ, అసోం రాష్ట్రాల మధ్య పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 2019 అసెంబ్లీ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

బలం సాధిస్తున్న కమలనాథులు

బలం సాధిస్తున్న కమలనాథులు

2006 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4.75 శాతం ఓట్లు పొందగలిగింది. అది 2011 నాటికి 6.03 శాతానికి, 2016 ఎన్నికల్లో 10.6 శాతం ఓట్లకు పెంచుకున్నారు. అంతే కాదు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలోనూ విజయం సాధించింది. 140 అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచిందీ బీజేపీ. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. అంతకుముందు 2011 ఎన్నికల్లో ఒక స్థానంలో మాత్రమే గెలుపొందగలిగింది. 2011 ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ.. 2016లో దాన్ని 10.2 శాతం ఓట్లు పెంచుకోగలిగింది.

బిజెపి ఓట్ల శాతం పెరిగింది

బిజెపి ఓట్ల శాతం పెరిగింది

రెండు రాష్ట్రాల్లోనూ 20 శాతానికి పైగా కమలనాథులు ఓట్లు పొందారు. ఈ పరిణామం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ స్థాయిలో ఓట్లను బీజేపీ పొందగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఓట్లు పొందిన బీజేపీ 2016లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ నేపథ్యంలో 2021లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తున్నందని అంటున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగినా ఓట్ల శాతం పెంచుకున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలో ఓట్ల శాతం గణనీయంగా తగ్గడమే బీజేపీని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నది.

2014 లోక్ సభ ఎన్నికల్లో కమలనాథుల ఓట్లు 17.5%

2014 లోక్ సభ ఎన్నికల్లో కమలనాథుల ఓట్లు 17.5%

బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 17.5 శాతం ఓట్లు పొందినా, 2016 అసెంబ్లీ ఎన్నికల నాటికి 10.2 శాతానికి పడిపోయింది. ఓట్ల శాతం తగ్గినా అసెంబ్లీలో తొలిసారి మూడు స్థానాలను గెలుపొంది రికార్డు నెలకొల్పింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 56 లక్షల ఓట్లు గెలుచుకున్న కమలనాథులు 2011లో 19.5 లక్షల ఓట్లు మాత్రమే పొందింది. 294 అసెంబ్లీ స్తానాల్లో 262 నియోజకవర్గాల పరిధిలో పదివేలకు పైగా ఓట్లను బీజేపీ పొందగలిగింది.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 17 % ఓట్లు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 17 % ఓట్లు

సంస్థాగత పునాది లేకున్నా దేశవ్యాప్తంగా బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 17 శాతం ఓట్లను పొందగలిగింది. 2016లో ఆ పవనాలే కనిపించడం లేదు. బీజేపీ సంస్థాగత సామర్థ్యానికి ప్రతిబింబంగా లేదు. మూడు స్థానాలను గెలుచుకోవడంతోపాటు 66 స్థానాల పరిధిలో 20 వేల నుంచి 30 వేల ఓట్లు పెంచుకున్నది. 16 నియోజకవర్గాల పరిధిలో 30 నుంచి 40 వేల లోపు ఓట్లు సంపాదించుకున్నది. మరో ఆరు స్థానాల్లో 50 వేల ఓట్లు సాధించి బీజేపీ గణనీయ విజయాలు సాధించింది.

2021 ఎన్నికల్లో గెలుపుపై ఆశలు

2021 ఎన్నికల్లో గెలుపుపై ఆశలు

బీజేపీ 70 స్థానాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఓటమికి కారణమైంది. లెప్ట్, కాంగ్రెస్ పార్టీల ఓటింగ్ పది వేల లోపు ఓట్లను పొంది ఆ రెండు పార్టీలను దెబ్బ తిన్నది. 2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ విజయాలు సాధించగలమని బీజేపీ విశ్వసిస్తోంది. అందుకు బహుళ అంచెల వ్యూహాలు అమలుచేస్తోంది.

పార్టీ బలోపేతానికి ఇలా..

పార్టీ బలోపేతానికి ఇలా..

పశ్చిమ బెంగాల్‌లో సంస్థాగతంగా బలోపేతం కావడమే బీజేపీ విజయానికి కీలకమని ఆ పార్టీ భావిస్తున్నది. ప్రత్యేకించి బూత్ స్థాయికి పార్టీ శ్రేణులు విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 25 నుంచి పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో విస్తరణ లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 15 రోజుల ‘విస్తార్ యాత్ర' నిర్వహించారు. గిరిజన గూడెల్లో ఇంటింటిని తట్టి పర్యటించారు. ఒక గిరిజనుడి ఇంటిని కూడా సందర్శించారు. 50 ఏళ్ల మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈ ప్రాంతంలో బూత్ స్థాయి కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. నక్సల్బరీ నియోజకవర్గాల పరిధిలో 93 బూత్‌ కమిటీలతో సమావేశమై వ్యూహాన్ని రచించారు. అమిత్ షా అంతటితో ఆగలేదు. కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 26న పర్యటించారు. నియోజకవర్గాల వారీగా బూత్‌లు, ఇండ్లలో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ దేశంలో 70 శాతం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నదని, కానీ ‘ఈబార్ బంగ్లా' ప్లాన్ పూర్తి కాలేదన్నారు.

బెంగాల్ లో అవినీతిపై ఇలా..

బెంగాల్ లో అవినీతిపై ఇలా..

శారదా, నారదా చిట్ ఫండ్ కంపెనీల్లో కుంభకోణాలపై సీఎం మమతాబెనర్జీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. రోజ్ వ్యాలీ, లా అండ్ ఆర్డర్ సమస్యలతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం సతమతం అవుతుందన్నారు. మమతాబెనర్జీ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. త్రుణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ జైలు పాలయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపైనే వివిధ ప్రాంతాల్లో సభల్లో బీజేపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

కేంద్ర నిధుల వినియోగంపై అమిత్ షా

కేంద్ర నిధుల వినియోగంపై అమిత్ షా

పశ్చిమబెంగాల్ రాష్ట్రాభివ్రుద్ధికి కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై మమతాబెనర్జీ ప్రభుత్వానికి అవగాహన లేదని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. 13వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు బెంగాల్ రాష్ట్రానికి కేంద్రం 1,03,539 కోట్లు కేటాయిస్తే, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా మోదీ ప్రభుత్వం రూ.2,89,942 కోట్లు కేటాయించిందని అమిత్ షా గుర్తు చేశారు.కానీ కేంద్రం ఆర్థికంగా బెంగాల్ ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని మమతాబెనర్జీ ఆరోపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతికి ఆమె ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

ముస్లింల బుజ్జగింపు వల్లే బెంగాల్ లో మత ఘర్షణలా?

ముస్లింల బుజ్జగింపు వల్లే బెంగాల్ లో మత ఘర్షణలా?

అసోంలో మైనారిటీలను బుజ్జగించేందుకు మెజారిటీ సామాజిక వర్గాన్ని పక్కనబెడుతున్నదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఆధిపత్యం సాధించింది. ముస్లింల పట్ల మమతాబెనర్జీ బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నాయని అమిత్ షా ఆరోపించారు.

English summary
After coming to power in 16 of the 29 states covering more than 60 per cent of the population, winning Opposition-ruled states such as Odisha, Himachal Pradesh and Karnataka may not be a far cry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X