వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎంసీ ఎన్నికల ఫలితాలు: శివసేన, బీజేపీ హోరా హోరీ, ఎవరికి దక్కని మేజిక్ ఫిగర్

రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, శివసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మరో 9 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.

|
Google Oneindia TeluguNews

ముంబై: రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, శివసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మరో 9 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. శివసేన, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది.

BMC election results 2017 Live Updates: Counting of votes to begin at 10 am

227 వార్డులున్న ముంబై కార్పొరేషన్లో శివసేన 84, బీజేపీ 81 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో మేజిక్ ఫిగర్ 114 సీట్లు ఎవరికీ రాకపోవడం గమనార్హం. మొదట్నుంచీ శివసేన ఆధిక్యం కనబర్చినా.. చివరి నిమిషంలో బీజేపీ దూకుడు చూపింది. దీంతో మేయర్ పదవి కోసం పొత్తు తప్పేలా కనిపించడం లేదు.

షోలాపూర్, అకోలా, అమరావతి, పింప్రి కార్పొరేషన్లలో కూడా బీజేపీ ఆధిపత్యం చూపింది. కాగా, ఉల్లాస్‌నగర్‌లో శివసేన ఆధిక్యం చూపింది. కాగా, శివసేన కార్యకర్తలు ముంబైలో సంబరాలు చేసుకున్నారు.

కాగా, గతంలో కంటే కూడా తక్కువ సీట్లు దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ముంబై చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.

మొత్తం 227స్థానాలు-ముంబై కార్పొరేషన్లో గెలుపు
బీజేపీ-82
శివసేన-84
కాంగ్రెస్-31
ఎంఎన్ఎస్7
ఎన్సీపీ-9
ఇతరులు-14

పుణె మొత్తం స్థానాలు 162
బీజేపీ-98
ఎన్సీపీ-40
శివసేన-10
కాంగ్రెస్-11
ఎంఎన్ఎస్-2
ఇతరులు-1

నాసిక్ మొత్తం స్థానాలు 122
బీజేపీ-67
శివసేన-34
కాంగ్రెస్-6
ఎన్సీపీ-5
ఎంఎన్ఎస్-5
ఇతరులు-5

మొత్తం స్థానాలు151- నాగ్‌పూర్‌
బీజేపీ- 108
శివసేన-2
కాంగ్రెస్-29
ఎన్సీపీ-1
ఇతరులు-11

వేలకోట్ల బెట్టింగ్

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వేల కోట్ల బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు రూ. 3వేల కోట్ల బెటింగ్ వ్యవహారాలు జరిగినట్లు తెలుస్తోంది.

English summary
The counting of votes for Brihanmumbai Municipal Corporation and nine other municipal corporation elections will begin at 10 am on Thursday. On February 21, nearly 56% voters had exercised franchise across 10 municipal corporations in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X